telugudanam.com

      telugudanam.com

   

గాంధీ పుట్టిన దేశమా ఇది

గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది

సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా || గాంధీ ||

సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం

ఉప్పొంగే నదులు జీవజలాలు ఉప్పు సముద్రాల పాలు

యువకుల శక్తిని భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు

ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు || గాంధీ ||

సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ

అధికారంకై తగవులాటలో అన్నదమ్ముల పోటీ

హెచ్చెను హింసా ద్వేషం ఏమవుతుందీ దేశం || గాంధీ ||

వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లైసెన్సు

అర్హతలేని ఉద్యోగాలు లంచం యిస్తే ఓయస్

సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవ్వంత చోటు

పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లదే భోజ్యం

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: