telugudanam.com

      telugudanam.com

   

జన్మభూమి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా

పొగడరా నీతల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవముఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో

జనియించినవాడ నీ స్వర్గఖండమున

ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో

నినుమోసె ఈ తల్లి కనక గర్భమునలేదురా ఇటువంటి భూదేవి యెందు

లేదురా మనవంటి పౌరులింకెందు

సూర్యుని వెలుతురుల్ సోకునందాక

ఓడల ఝండాలు ఆడునందాకఅందాక గల ఈ అనంత భూతల్లిని

మన భూమి వంటి చల్లని తల్లి లేదు

పాడరా నీ తెలుగు బాలగీతములు

పాడరా నీ వీర భావ గీతములు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: