telugudanam.com

      telugudanam.com

   

జయము జయము భరతావని!

జయము జయము భరతావని!

సకల భువన పావనీ!

జయము జయము స్వేచ్ఛాప్రియ

జనతా సంజీవనీ!

అరుణారుణ చరణ కిరణ

కరుణా రసవాహినీ!

క్షమతాప్రియ మమతామయ

సమతా సమ్మోహినీ!

ధర్మవీర సమరధీర

దానశూర జనయిత్రీ!

నిర్మల విజ్ఞాన ధాత్రి

కార్మిక కర్షక సవిత్రి!

మలయ పవన చలమపవన

కలిత లలిత హరితాంబర!

అతి సుందర సరిదంతర

ప్రతి బింబిత నీలాంబర!

పాటల సుమ సుకుమారీ

కోటి కోటి నరనారీ!

గళమంగళ విజయవాణి

లలితకళా కల్యాణీ!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: