telugudanam.com

      telugudanam.com

   

రమణీయకముతో రాగమంచి

పావన నాగావళీ వంశధారలు

సీమత ధామ సుశ్రి నహింప

నిఖిల పుణ్యపగా నిలయ గోదావరి

మరకత హార విస్ఫురణ నెరవ

శోభన కృష్ణవేణీ, భద్రగామిని

మణిహేమ కాంబికా మహిమ నింప

విమల పెన్నా నదీ వీలుకా బిభవమ్ము

చరణ మంజీర నైఖలి భజింప

దివ్యమోహన కళలతో తేజరిల్లి

దెసలు దెసెలెల్ల దీపింప తెలుగు తల్లి

ప్రాజ్య సువిశాల సుప్రజా రాజ్య వీధి

నిండు కొలువుండె కన్నుల పండువగుచు

పుడమికి పండుగయ్యె విరబూచెను

భూ జన హత్సుమావశుల్

బడుగుల జీవితాల చిర భాజ్య

శుభోదయ దోచి దోచె సం

దడిగ జనావళీ హృదయ తంత్రులు

తీయగ మ్రోగ సాగి లే

వరులను సోలు జీవికల వైభవముల్

విలసిల్లె కొల్లగా

లేవోయీ నలుదిక్కులందు జయభేరి నాద ముప్పొంగ రా

రావోయీ హృదయాంతరాన శుభ

సమ్రంభంబు జృంభించె లే

లే వోయీ కనుగోనలందు మనసేలే కాంక్ష

రూపించెరా

రావోయీ ప్రియ బాంధవా ప్రియ సఖా రా!

మానవోత్తంసమా!

శ్రీనాధ కవిరాజ చిత్రవర్ణా కీర్ణ

భవ్య ప్రభంధాల భావమంచి

రాగ రంజిత త్యాగరాజ సంకీర్తనా

రమణీయకముతో రాగమంచి

కృష్ణవేణీ సముతృష్ణ నర్తన కళా

కేళీ తరంగిణిన్ తాళమంచి

ఆంధ్ర ప్రదేశోదయానంద వేళా స

మారంభ సంగీత మంచుకొసగ

కావ్యగానము సేయు సత్కవులు వెలయ

మాపదాంధ్ర ప్రతిభ మన భావి నిలువ

పుడమి నిడె ఎర్ర మందారపూవు పగిది

పరిమళీంచెను బ్రతుకు సంపంగి కరణి

నన్నయ్య మొదలుగా నాబోటి కవిదాక

గలయాంధ్ర సుకవితా కౌశలమ్ము

భారతమ్మాదిగా చిడి పాత్తముల దాక

గలయాంధ్ర సాహితీ గౌరవమ్ము

శ్రీకాకుళము మొదల్ చిత్తూర్ కడదాక

గల యాంధ్ర దేశీయ ఎలననమ్ము

ముసలి వొగ్గుల మొదల్ ముద్దుబిడ్డల దాక

గల యాంధ్ర జాతీయ కలకలమ్ము

గొంతు గొంతున గాన స్రవంతి గాగ

పుటపుతాంతర్గత పురాణ బోధ గాగ

దిక్కుదిక్కుల ధ్వనియించు బుక్కుగాగ

పొడిచె నిపుడిప్పుడె తెనుగు ప్రొద్దుపొడుపు

బ్రతుకు బ్రతుకున తీయని పాట రేగి

గొంతు గొంతున గానస్రవంతు లురలి

దేశదేశాల తెలుగుల దీప్తి వెలుగ పాడుచు

మెల్లమెల్లగా తెనుగు ప్రొద్దుపొడుపు

ప్రాభాతోత్సవమయ్యె ప్రాగ్దిశ మపారాజీవ

రాగంశువుల్

శోభారామముగాగ జేసె ప్రకృతిన్

సుతాలచలాలంకృతిన్

భూభాగసమ్ము వసంత గార రస సంపూర్ణంబు

గాదోచె

రా! భవ్యాశయ దివ్య దీప్తులమరెన్

త్రైలింగ దేశమ్మునన్!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: