telugudanam.com

      telugudanam.com

   

సంస్కార హృదయులు

ఏ దేశమందున్న ఏ రాష్ట్రమందున్న

భారతీయులమన్న భావమ్ము వదలక

ఆంధ్ర సంస్కృతి భువినే అలరింపజేయుడీ!

ఆంధ్రులారా! సుగుణసాంధ్రులై వెలయుడీ!

మానవతావాది మంజుల ద్వాంతుండు

శాక్యముని శిష్యుండు సంఘాభిరాముడు

పండితవ రేణ్యుండు సంఘాభిరాముడు

ఆర్య నాగార్జునుడు ఆంధ్రుల కులపతి

సంఘాభివృద్దికే సాహిత్య మనుమాట

సార్థకము చేసిన సత్కవిశ్రేష్టులు

సంస్కార హృదయులు సదసద్వివేకులు

తిక్కన వేమనలు తెలుగు మేధావులు

పంచేంద్రియంబుల వంచనను బరిమార్చి

సచ్చరిత్రంబున శాంతి మార్గమున నిచ్చు

సంగీత సాధకుని సహృదయ తిలకుని

త్యాగయ్య గని ఆంధ్ర ధన్యురా లయ్యెను

వెంకట రత్నము, వూరేశలింగము

అప్పరాయ మనీషు లాంధ్రులకు గురువులు

ఇదే ఆంధ్ర సంస్కృతి ఇవే తెల్గు వెలుగులు

అంధ్ర సంస్కృతి నిలన్ అలరింపజేయండీ.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: