telugudanam.com

      telugudanam.com

   

తల్లీ భారతి వందనము

తల్లీ భారతి వందనము - తల్లీ భారతి వందనము

నీ ఇల్లే మా నందనము - మేమంతా నీ పిల్లలము

నీ చల్లని ఒడిలో మల్లెలము - తల్లి తండ్రులను గురువులను

ఎల్లవేళల కొలిచెదమమ్మ - చదువులు బాగాచదివెదమమ్మ

జాతిగౌరవము పెంచెదమమ్మ - కుల మత భేదము మరచెదము

కలతలు మాని మెలగెదము - మానవులంతా సమానులంటూ

మమతను సమతను పెంచెదము - తెలుగుజాతికి అభ్యుదయం

నవభారతికి నవోదయం - భావిపౌరులం మనం మనం

భారత జనులకు జయం జయం - భావిపౌరులం మనం మనం

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: