telugudanam.com

      telugudanam.com

   

తల్లీ భారతి

స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి

నిరంకుశము శక్తి అయినా

నిర్ణయముగా ఎదిరించండి

నదుల న్యాయమున బాధలు పొంది

బ్రతికిన చచ్చిన భేదములేదు నరుల || స్వాతంత్ర్యమే ||

కవోష్ణ రుధిర జ్వాలల తోటి

స్వాతంత్ర్య సమరం నడపండి

ఎంతకాలమిటు దహించుచున్న

దోపిడి మూకకు దయరాదన్న - ఎంత || స్వాతం ||

సంఘములలోను ఐక్యంలేదని

నలకలపడికు శాంతి అవధాన

స్వర్ణ తుల్యమౌ స్వతంత్ర జ్యోతికి

మాంగల్యపు హారతులమ్మా || స్వాతం ||

సీతా మొగల్ రణధీరు కాంతి యాదోసే

ఝాన్సీల స్వాతంత్ర్య సమరదీప్తి

త్యాగమూర్తులు తిలక్‌ దాదా ఫిరోజు

మాల్యన మన గాంధీ మహీర శక్తి

జాతీయ సంయోకామ్యా హింసతోడ

కాంగ్రేస్సు నడిపించిన కదన రేగతి

తమిళ, ఆంధ్ర, కేరళ ధరణి ప్రజలెల్ల

ధారపోసిన మహాత్యాగ ఫలము

మాతృదేశముగాన క్షాత్రమూసినబోను

బడరాని ఇడుముల బడిన క్రమము

పండిత నెహ్రూజీ పటేలు పట్టాభి

రాజాజీ నెరసిన రాజ్య పటిమ

భారతీయుల పుణ్యంబు పుచ్చెననెగా

వచ్చెనదిగో సుస్వాతంత్ర్య వత్సరము

పొత్తుకూడక సుఖముల పొందరయ్య

తల్లి భారతి విభవమ్ము వెల్లివిరియు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: