telugudanam.com

      telugudanam.com

   

ఉగ్రనేత్రం తెరచి ఉరికింది తెలుగు

కడలి అంచులు దాటి కదిలింది తెలుగు

ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు

ఇటు మలేషియా నుంచి అటు అమెరికా వరకు

నలుదిశల గొంతుకల పలికింది తెలుగు

పెనుయెడారులలోన ఇనుప దారులలోన

పలుకు పలుకున జీవమొలికింది తెలుగు

ఎక్కడున్న ఎన్ని చిక్కులున్న సరే

తలెత్తి నిలుపుమని తెలిపింది తెలుగు

ఏ భాష వెనుకైనా ఏ వాన చినుకైనా

తనలోన కలుపుకుని తరలింది తెలుగు

బరిగొదిగి పోతన్న బరవళ్ళతో సాగి

హమ్మంటు వేమనగ ఉరిమింది తెలుగు

అభినయానికి హృదయ మర్పించుకొని కూచి

పూడియే నాడిగా ఆడింది తెలుగు

సంగీతమే జీవసంపుటిగ త్యాగయ్య

ప్రతిపదంలో కరిగి పాడింది తెలుగు

పల్లె పాటలలో ప్రభంధ నాటికలలో

కలికి వయ్యారాలు చిలికింది తెలుగు

స్వాతంత్ర్య సమరాన స్వచ్చంద గతులీన

ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు

శాంతి కపోతమై క్రాంతి జలపాతమై

నిత్యవర్థిష్ణువై నిలిచింది తెలుగు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: