telugudanam.com

      telugudanam.com

   

జానపద గీతాలు (కొన్ని)

బావా! బావా! పన్నీరు

"బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

మూడు గుద్దులు గుద్దేరు

మూలన మంచం వేసేరు

ముంతెడు గంజి యిచ్చేరుబావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు

చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు."పల్లేరు తెప్పించి పక్క వేయండీ

నల్లేరు తెప్పించి నలిచి విడువండీ

నల్లేరు చేతాను నయము కాకుండీ

దూలగొండి తెచ్చి దులుపి పంపండి."


చీరల్ కావలెనా

"చీరెల్ కావలెనా రవికల్ కావలెనా

నీకేమి కావలెనే పొద్దుటూరి సంతలోనా

చీరల్ నా కొద్దురో రవికల్ నా కొద్దురో

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

డావుల్ కావలెనా ఆరం కావలెనా

నీకేం కావలెనే పులివెందుల సంతలోనా

డావుల్ నాకొద్దురో ఆరం నాకొద్దురో

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

కమ్మల్ కావలెనా కడియాల్ కావలెనా

నీకేమి కావలెనే దర్మారం సంతలోనా

కమ్మల్ నాకొద్దురా కడియాల్ నాకొద్దురా

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా"


గుత్తొంకాయ్ కూరోయ్ బావా!

గుత్తొంకాయ్ కూరోయ్ బావా!

కోరివండినానోయ్ బావా!

కూర లోపల నా వలపంతా

కూరి పెట్టినానోయ్ బావా


కోరికతో తినవోయ్ బావా!


తియ్యని పాయసమోయ్ బావా!

తీరుగ వండానోయ్ బావా!

పాయసమ్ములో నా ప్రేమనియేటి

పాలుబోసినానోయ్ బావా!


బాగని మెచ్చాలోయ్ బావా!


కమ్మని పూరీలోయ్ బావా!

కర కర వేచానోయ్ బావా!

కర కర వేగిన పూరీలతో నా

కాంక్ష వేసినానోయ్ బావా!


కనికరించి తినవోయ్ బావా!


వెన్నెల యిదిగోనోయ్ బావా!

కన్నుల కింపౌనోయ్ బావా!

వెన్నెలలో నా కన్నె వలపనే

వెన్న గలిపినానోయ్ బావా!


వేగముగా రావోయ్ బావా!


పువ్వుల సెజ్జిదిగో మల్లే

పువ్వులు బరిచిందోయ్ బావా!

పువ్వులలో నా యవ్వనమంతా

పొదివి పెట్టినానోయ్ బావా!

పదవోయ్ పవళింతాం బావా!


జుంకాలు కావలెనా

"జుంకాలు కావలెనా గంటీలు కావలెనా

మరిఏమికావలెనా మరదలు నరసమ్మ నీకుజుంకాలు వలదురో గంటీలు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావబాడీలుకావలెనా జాకెట్లుకావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకుబాడీలు వలదురో జాకెట్లు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావసీరెలు కావలెనా లంగాలు కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకుసీరెలు వలదురో లంగాలు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావసిలకలు కావలెనా కమ్మలు కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకుసిలకలు వద్దురో కమ్మలు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావఅద్దం కావలెనా దువ్వెన కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకుఅద్దం వద్దురో దువ్వెన వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావపౌడరు కావలెనా దువ్వెన కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకుపౌడరు వద్దురో దువ్వెన వలదురో

నీవేకావాలిరో బలుగురు కొండయ్యబావ".

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: