telugudanam.com

      telugudanam.com

   

కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా

మామ : కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా ...నీవు

పోకడెక్కడ పోయినావె సై కోడలా


కోడలు : మాపున చెప్పిన మాటలకు మామయ్యలో ...నేను

మల్లెమొగ్గలేరబోతి మామయ్యలో


మామ : మల్లెమొగ్గలేరలేదు సై కోడలా ...నీవు

చిల్లర పని చేసినావే సై కోడలా


కోడలు : చిల్లరపని చెయ్యలేదు మామయ్యలో ...నీ

చిన్ని ముద్దు కొడుకు తోడు మామయ్యలో


మామ : అద్దమ్ము రాతిరి వై కోడలో ...మన

మిద్దె మీద చప్పుడేమి వై కోడలా


కోడలు : పొరుగింటి పోతుపిల్లి మామయ్యలో

మన యింటి ఆడపిల్లి మామయ్యలో

దిబ్బదిబ్బలాడినాయి మామయ్యలో ...అవి

దిబ్బదిబ్బలాడినాయి మామయ్యలో

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: