telugudanam.com

      telugudanam.com

   

పిల్లల పాటలు (కొన్ని)

వచ్చిపోవే పిచ్చుకమ్మా

వచ్చిపోవే, వచ్చిపోవే

పిచ్చుకమ్మా వచ్చిపోవేకొయ్య ముక్కలు గూడు చేశా

రేకు ముక్కను తలుపు చేశా

మెత్త మెత్తని ఈకలెన్నో

గూటి నిండా పరచి ఉంచా.గ్రుడ్ల నిక్కడ పెట్టుకుంటే

పొదిగి పిల్లల చేసుకుంటే

కాకి పోరూ గ్రద్ద పోరూ

పిల్లి పోరూ ఉండ వింకాఈగ నైనా వాల నీయను

దోమనైనా దూర నీయను

నచ్చితేనే, మెచ్చితేనే

వచ్చి గూట్లో ఉండి పోవే


[ వెనుకకు ]


పిల్లి...

పిల్లి పిల్ల వచ్చింది - ఉట్టి పైకెగిరింది

కావలున్న ముసలవ్వ - కర్రతీసి విసిరింది

పాలకుండ పగిలింది - పిల్లి పారిపోయింది

అవ్వ అందుకేడ్వటం - తాత చూసి నవ్వటం


[ వెనుకకు ]


సూర్యుడు - చంద్రుడు

పగటికి దీపం సూర్యుడు

రాత్రికి దీపం చంద్రుడు

జాతికి దీపం సుపుత్రుడు

త్రిలోక దీపం పవిత్రుడు


[ వెనుకకు ]


అమ్మ అప్పచ్చి

పాపా పాపా అలిగా వేలా!

అమ్మ అప్పచ్చి యివ్వలేదుగా

పాపా పాపా పకపక లేలా!

అమ్మ అప్పచ్చి యిచ్చినారుగా

ఎందుకు పాపా ఏడుపు మరలా?

అప్పచ్చి కాకీ తన్నుకెళ్ళెగా.


[ వెనుకకు ]


పెద్దల మాట

అమ్మమాట చద్దన్నం మూట

నాన్నమాట కంచుకోట

గురువు మాట గులాబీల తోట

తాతగారి మాట తారంగం ఆట

చెడ్డవారి మాట మంచి నీళ్ళ మూట

రాజుగారి మాట రత్నాల మూట

బామ్మమాట బంగారు బాట

మనందరి మాట మల్లెపూల బాట


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: