telugudanam.com

      telugudanam.com

   

పిల్లల పాటలు (కొన్ని)

వానల్లు కురవాలి - వానదేవుడా

వానల్లు కురవాలి - వానదేవుడా

వరిచేలు పండాలి - వానదేవుడానల్లని మేఘాలు - వానదేవుడా

చల్లగా కురవాలి - వానదేవుడామాఊరి చెరువంత - వానదేవుడా

ముంచెత్తి పోవాలి - వానదేవుడాకప్పలకు పెండ్లిండ్లు - వానదేవుడా

గొప్పగా చేస్తాము - వానదేవుడాపచ్చగా చేలంత - వానదేవుడా

పంటల్లు పండాలి - వానదేవుడావానల్లు కురవాలి - వానదేవుడా

వరిచేలు పండాలి - వానదేవుడా


[ వెనుకకు ]


గోరుముద్ద

గోరు గోరు ముద్ద

కాకమ్మ ముద్ద

చందమమ ముద్ద

చక్కనైన ముద్ద

పాపాయి ముద్ద

పానకాల ముద్ద

ఆ....ఆ....

ఆసి బూసి నోట్లోముద్ద

గుటుక్కున మింగూ........


[ వెనుకకు ]


ఏడవకు ఏడవకు

ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి

ఏడిస్తే నీ కళ్ళ నీలాలుకారు

నీలాలు కారితే నేచూడలేను

పాలైన కారవే బంగారు కళ్ళ


[ వెనుకకు ]


బాలలం, బాలలం - 1

బాలలం, బాలలం మేమంత బాలలం

కన్న తల్లిదండ్రులకు - కదలాడే బొమ్మలం

భరతమాత పెంచుతున్న - భావి మావి కొమ్మలం

చదువుకునే దీపాలం - సమత నాత రూపాలం

నవ భారత మందిరాన - నవ జీవన శిల్పాలం


[ వెనుకకు ]


బాలలం - బాలలం - 2

బాలలం మేం బాలలం

భావితరానికి దివ్వెలంనవనాగరికత వెలుగులం

సమసమాజ నిర్మాతలంమానవతకు వెలుగులం

మహోన్నతికి రూపాలంవినయానికి సంపన్నులం

ఐక్యమత్య ప్రభోధకులం


[ వెనుకకు ]


దూదుపుల్ల

దూదుపుల్ల దురాయ్‌పుల్ల

చూడకుండా జాడ తీయ్

ఊదకుండా పుల్ల తీయ్


[ వెనుకకు ]


నారాయణ నారాయణ నక్క తోక

నారాయణ నారాయణ నక్క తోక

నా మొగుడు తెచ్చాడు కొత్త కోక

నేనెందుకుంటాను కట్టుకోక

ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక

మా అత్త వుంటుందా మొత్తుకోక.


[ వెనుకకు ]


ఇంతింత దీపం

ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు

మాడంత దీపమ్ము మేడలకు వెలుగు

గోరంత దీపమ్ము కొండంత వెలుగు

గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు

ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు

మాచిట్టి అబ్బాయి మాకళ్ళ వెలుగు


[ వెనుకకు ]


చిట్టి చిట్టి మిరియాలు

చిట్టి చిట్టి మిరియాలు

చెట్టూకింద పోసి

పుట్టమన్ను తెచ్చి

బొమ్మరిల్లు కడితె

బొమ్మరింట్లో పాప పుట్టె


[ వెనుకకు ]


బంగారు మూట

తాతా తాతా తైతక్కలాట

నువ్వుందేమో సామర్లకోటకోట కింద బొమ్మలాట

కూచుందేమో కుర్చీపీట

పీట కింద బంగారు మూటఆ మూట నాకిస్తే

నీ మాట నేవింట.


[ వెనుకకు ]


చల్ చల్ గుర్రం

చల్ చల్ గుర్రం

చలాకి గుర్రం

కర్రతో చేసిన

గజ్జెల గుర్రంమువ్వలు మెడలో

ముద్దుగ గట్టీ

రంగుల హంగుల

సింగారించివీపుకు జీను

సాపుగ వేసి

వదిలేస్తే సరి

పరుగుడు గుర్రంకళ్ళెం చేత్తో

గట్టిగ బట్టి

గుర్రం మీద

కూర్చొని యుండీచల్ చల్ చల్‌మని

తోలుచు వుంటే

గంతులు వేయుచు

పరుగిడు గుర్రంచల్ చల్ గుర్రం

చలాకి గుర్రం


[ వెనుకకు ]


చీమ

చీమ ఎంతో చిన్నది

పనిలో ఎంతో మిన్నది

ముందుచూపు వున్నది

పొదుపులోన మిన్నది


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: