telugudanam.com

      telugudanam.com

   

పిల్లల పాటలు (కొన్ని)

మన జాతీయ జెండా

మూడు రంగుల జెండా

ముచ్చటైన జెండా

భారతీయుల జెండా

బహు గొప్ప జెండాఅందరూ మెచ్చిన జెండా

ఆకాశంలో ఎగిరే జెండా

అంధకారం పోగొట్టిన జెండా

ఆశలు మనలో రేపిన జెండాగాంధీతాత మెచ్చిన జెండా

నెహ్రుగారికి నచ్చిన జెండా

భగత్‌సింగ్ పట్టిన జెండా

బోసు నేత ఎగరేసిన జెండాతెల్లదొరలను ఎదిరించిన జెండా

చల్లగ స్వరాజ్యం తెచ్చిన జెండా

అందరి మదిలో నిండిన జెండా

పింగళి వెంకయ్య ఊహల జెండాశాంతి సహనం చూపిన జెండా

అందరి నొక్కటిగా నడిపిన జెండా

మంచి మమతలు చూపిన జెండా

ఇదే నండి మన జాతీయ జెండా


[ వెనుకకు ]


అంతా ఒక్కటే

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే

ఆంధ్రులమైన తమిళులమైనా

ఉత్కళులైనా కన్నడులైనా

మరాఠి అయినా గుజరాత్ అయినా

పంజాబ్ అయినా బంగ్లా అయినా || అంతా ||వందనమండీ వందనం (తెలుగు)

వణక్కమమ్మా వణక్కం (తమిళం)

నమస్కార్ నమస్కార్ (హిందీ)

ఇస్సలాం ఇస్సలాం (అస్సామీ)భాషలు వేర్వేరైనా గానీ - భావాలన్నీ ఒక్కటేనోయి

జాతులు, మతములు - నీతులు అన్నీ ఒకటేనోయి

దేశాలన్నీ ఒకటే అయితే - ద్వేషాలేవీ ఉండవుగా,బాలప్రపంచం, భావి ప్రపంచం

భావి భారత వారసులం || అంతా ||


[ వెనుకకు ]


నారాయణ నారాయణ

నారాయణ నారాయణ అల్లా అల్లా

మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా                        || నారాయణ ||మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే

మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ ||ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే

కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే

మతం వద్దు గతం వద్దు

మారణ హొమం వద్దు                                            || నారాయణ||మతమన్నది గాంధీజీ హితమైతే

మతమన్నది లోకానికి హితమైతే

హిందువులం ముస్లిములం

అందరము మానవులం,

అందరమూ సోదరులం                                   || నారాయణ ||


[ వెనుకకు ]


పిల్లల్లారా పాపల్లారా

పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా

పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లలారామీ కన్నుల్లో పున్నమి జాబిల్లి

ఉన్నాడు ఉన్నాడు పొంచుకున్నాడు

మీ మనస్సులో దేవుడు కొలువై ఉన్నాడు

ఉన్నాడు అతడున్నాడుభారతమాతకు ముద్దుల పాపలు, మీరేలే మీరేలే

అమ్మకు మీపై అంతులేని ప్రేమలే, పిల్లల్లారా ప్రేమలే

రేపటి భారత పౌరుల్లారా...భారదేశం ఒక్కటే ఇల్లు భరతమాతకు మీరే కళ్ళు

మీరే కళ్ళు, మీరే కళ్ళు జాతి పతాకం పైకెగరేసిజాతి గౌరవం కాపాడండి బడిలో బయట అంతా కలిసి

భారతీయులై మెలగండి కన్యాకుమారికి కాశ్మీరానికి

అన్యోన్యతను పెంచండి వీడని బంధం వేయండి || పిల్లల్లారా ||


[ వెనుకకు ]


వీర గంధము

వీర గంధము దెచ్చినారము

వీరుడెవ్వడో తెల్పుడీ!

పూసి పోదుము మెడను వైతుము

పూలదండలు భక్తితో ||తెలుగు బావుట కన్ను చెదరగ

కొండవీటను నెగిరినప్పుడు

తెలుగు వారల కత్తి దెబ్బలుగండికోటను కాచినప్పుడు

తెలుగు వారల వేడి నెత్తురు

తుంగభద్రను గలిసినప్పుడు

దూరమందున నున్న సహజకత్తినెత్తురు కడిగినప్పుడు

ఇట్టి సందియు మెన్నడేనియు

బుట్టలేదు రవంతయున్;

ఇట్టి ప్రశ్నలు నడుగువారలులేకపోయిరి సంతయున్

నడుము గట్టిన తెలుగు బాలుడు

వెనుక తిరగండెన్నడున్,

బాసయిచ్చిన తెలుగుబాలుడుపాఱిపోవడం డెన్నడున్

ఇదిగో! యున్నది వీరగంధము

మై నలందుము మైనలందుము

శాంతి పర్వము జదువవచ్చునుశాంతి సమరం బైన పిమ్మట

తెలుగు నాటిన వీరమాతను

జేసి మాత్రము తిరిగి రమ్మిక

పలు తుపాకులు పలు ఫిరంగులుదారి కడ్డము రాక తప్పవు

వీర గంధము దెచ్చినారము

వీరుడెవ్వడో తెల్పుడీ|

పూసి పోదము మెడను వైతుము

పూల దండలు భక్తితో||


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: