telugudanam.com

      telugudanam.com

   

పిల్లల పాటలు (కొన్ని)

ఎందుకు?

మనిషిగ పుట్టిన దెందుకురా?

మంచిని పెంచేటందుకురాబడికి వెళ్ళే దెందుకురా?

చదువులు నేర్చేటందుకురాచదువులు నేర్చే దెందుకురా?

జ్ఞానం పొందే టందుకురాజ్ఞానం పొందే దెందుకురా?

ప్రగతిని పెంచే టందుకురాప్రగతిని పెంచే దెందుకురా?

చక్కగ బ్రతికే టందుకురా


[ వెనుకకు ]


సుభాషితాలు

కలసిమెలసి తిరుగు

స్నేహమపుడే పెరుగు

చేయి చేయి కలుపు

శాంతి గీతి పలుకుధర్మమెపుడు విడకు

దారి అదియే కడకు

నీతి విడుట తప్పు

జాతి కదియే ముప్పునయము తప్పవద్దు

నడత చెడిన దిద్దు

మంచిమాట నుడువు

మందితోడ నడువు.


[ వెనుకకు ]


పాము

భలే భలే పామురా

బారెడు పొడుగుందిరా

పడగ విప్పుతుందిరా

నాట్యమాడుతుందిరా

బుస్సుమంటుందిరా

పేరు నాగుపామురా


[ వెనుకకు ]


అరటి

అరటి చెట్టు చూడరా

అందమైన చెట్టురా

ఆకులన్ని పచ్చన

అరటిపండు తియ్యన


[ వెనుకకు ]


హంస

రాజహంస తెల్లన

దాని నడక చక్కన

రామచిలుక పచ్చన

దాని పలుకు కమ్మన

కోకిలమ్మ నల్లన

దానిపాట తియ్యన


[ వెనుకకు ]


సీతాఫలం

సీతాఫలం ఎంతోబలం

అందులో ఉంది తియ్యని గుజ్జు

బుజ్జీ గుజ్జును తినేసెయ్

గింజలు విసిరి పారేసెయ్


[ వెనుకకు ]


జామ

తియ్య జామ పండు

తింటే మంచిగుండు

జబ్బు చేయకుంటె

ఇవ్వు నాకు రెండు.


[ వెనుకకు ]


నారింజ

నారింజకాయ

నిన్నుచూడగానే

నోరూరుచుండు

తొనవొలిచి తింటే

అబ్బబ్బ పులుపు


[ వెనుకకు ]


బొమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు

రంగురంగు బొమ్మలు

రకరకాల బొమ్మలు

సింగారాల బొమ్మలు - బంగారు బొమ్మలు

ఆడేపాడే బొమ్మలు - అందమైన బొమ్మలు

నీతిని నేర్చే బొమ్మలు - ఖ్యాతిని కూర్చే బొమ్మలు


[ వెనుకకు ]


బంతి

బంతి బంతి - ఇది నాబంతి

కాళ్ళులేవు - చేతుల్లేవు

గుండ్రని పొట్ట - పొట్టనిండ గాలి

ఎగురును దుముకును - ఇది నా బంతి


[ వెనుకకు ]


పోలీసు

పోలీసువాణ్ణి నేనైతే

జోరుగ కాకీ డ్రెస్సేస్తా

చేతిలో లాఠీ పట్టేస్తా

దొంగలందరిని పట్టేస్తా


[ వెనుకకు ]


చిట్టి చిట్టి బొమ్మలు

చిట్టి పొట్టి బొమ్మలు

చిత్రాల బొమ్మలునవ్వే పువ్వులు

నడిచే మువ్వలుచుక్కల్లో చంద్రుడు

చూడంగవచ్చే


[ వెనుకకు ]


పాపాయి కన్నులు

పాపాయి కన్నులు కలువ రేకుల్లు

పాపాయి జులపాలు పట్టు కుచ్చుల్లు

పాపాయి దంతాలు మంచిముత్యాలు

పాపాయి పలుకులు పంచదార చిలకలు


[ వెనుకకు ]


కోడిగుడ్డు

వావ వచ్చి వంకలు పారె

కోడి వచ్చి గుడ్డు పెట్టె

తాత వచ్చి తొంగి చూసె

అవ్వ వచ్చి గుడ్డు తీసె

అమ్మ వచ్చి అట్టు చేసె

అన్న వచ్చి గుటుక్కున మింగె

నాకు మాత్రం - లేనే లేదు


[ వెనుకకు ]


చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు

చిన్ని సైకిలు కొన్నాడురాళ్ళ మీద తిప్పాడు

కాలు జారి పడ్డాడు

ఆసుపత్రిలో చేరాడుమందు బిళ్ళలు మింగాడు

మళ్ళీ ఇంటికి వచ్చాడు

మంచం ఎక్కి పన్నాడు


[ వెనుకకు ]


మా తాత

మా తాత ముఖము

అందమైన ముఖముమా తాత గుండు

గుమ్మడి పండుమా తాత మీసం

రొయ్యల మీసంమా తాత పిలక

పంచదార చిలక


[ వెనుకకు ]


పుట్టిన రోజు

పుట్టిన రోజు పండుగనాడు చుట్టాలొచ్చారు

కాజాలడ్డూ తాజాగారెలు తెచ్చీపెట్టారు

ఇరుగుపొరుగూ పిల్లాపెద్దా ఇంటికివచ్చారు

చిందులు తొక్కే చిట్టిపాపకి దీవెనలన్నారు


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: