telugudanam.com

      telugudanam.com

   

సతీపతీ సంవాదము

(తలుపు దగ్గర పాట)

చిలుకల కొలికిరో చిత్రకవాటము బిగియించుట తగవేమి?

ఇవ్వల గుందగపనియేమి పగలు అడుగుటకు యెక్కడ దొంగవు

వదలర వదలవోయి నీవనితల ఒల్లగనోయి||చిలుకల||

నీకుమించిన వనితల నాకిక యెవరులేరుగద

యింతి నీ కాంతుడనే ఓ పూబంతీ చిలుకల

నీ బూటకపు బాటలు బూటలు దెలిసెను

వీటికి బొంకేవు యికనాడనునా మదిలో వోయి చిలుకల

కలలోనైనను కల్కిరో నినువినా నన్యకాంతనే నెరుగనే భామ|| చిలుకల

భామరో నీపై ప్రేమచేత నేబత్తు పీతాంబ్రములు దుస్తి బహు ప్రీతిచేత

నితులొస్తి పీతాంబరములు రాతిరి తగిలిన నాతికియ్యగదవోయి బహు ప్రీతిచెకొనవోయి ||చి||

కనపుసొమ్ములు కమ్ములు జమికలు కానుక దెచ్చితి కొమ్మ ఉంచుకొనవే బంగారుబొమ్మా, కనకపుకమ్ములుజుమికీలుకల్కి కిచ్చిరావోయి దానిపల్లులువినగదవోయి ||చి||

గడచిన వెనుక గడబిడి చేయక కాంతరోననుకరుణించి, నమ నీచెంతను జేర్చి మన్నించి

వేడెద వాలికి కిర్రునదీ వరనరసింహ పురవాసినా తప్పులన్ని మన్నించుము యీశా ||చిలుకల||

[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: