telugudanam.com

      telugudanam.com

   

సీతాదేవి పెండ్లి పాట

సీతాకళ్యాణ మహోత్సవ సమయము చూతము రారెచెలీ

రాతి నాతిగ చేసి ఘోరాసుర వర్గమునెల్ల దునిమి

భూమిజచేకొని జనకసుత ప్రఖ్యాతిగ వరించినాడట                            ...సీతా...బంగారు మంటపాంతరమున నవరత్న శృంగార పీఠమందు

రంగుగ చేమంతి విరుల రంగుదండలు కాంతివైనుప్పొంగి

తొంగిచూచుటకు రఘుపుంగవుండు వేంచేసి వేడిన                            ...సీతా...తీరాయినయన్నము చారుపప్పు నెయ్యిపూర్ణభక్ష్యములుండెను

కోరికలలరగ భూమిసురులకు తారతమ్యము అడుగ భూసురులకు

నరులకును చేసెదానముదీనులకును దేవుడేయితడట                         ...సీతా...భేరీ మృదంగకాహశములు మ్రోయగవాకకామినులాడంగగోరి

దశరధ రాముడితడట వారిజాక్షిని పెండ్లియాడెను తీరుగా

ముత్యాల హారతి చేరీపట్టగసమయమిపుడు                                        ...సీతా...వరహర్మ్యమయ గోపురములందు వరదుడై కనకదుర్గాలయమందు

వరదుడై భద్రాద్రి శ్రీరాముడు ధరణిజను పెండ్లాడుటకును

గరిమతో నరసింహదాసుని పరగృహంబునకేగునట యిటు .                 ...సీతా...సీతాకళ్యాణోత్సవమును కన్నులజూడగా కౌతుకమగుచున్నది

చల్లగా శ్రీపాదములు అహల్య శాపము మాపిన

వరకౌసల్యా రాముడంత దాసుల నెల్లబ్రోచునటంచు వింటిని               ...సీతా...

[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: