telugudanam.com

      telugudanam.com

   

నానార్థములు

 

మొత్తం నానార్థములు - [92 నానార్థములు 4 పుటలలో ]      1 2 3 4 > >>  

 
 • అంకము   -   నాటకభాగము, సమీపము, చిహ్నము, అంకె
 • అంగము   -   శరీరము, ఉపాయము, భాగము, అవయవము
 • అంటు   -   మైల, తాకు, నేలపైపాతిన కొమ్మ
 • అంబ   -   తల్లి, పార్వతి, అంబిక
 • అంబరము   -   ఆకాశము, వ్యసనము, వస్త్రము
 • అక్షరము   -   ఓం కారము, తపస్సు, ధర్మము, వర్ణము, యజ్ఞము
 • అని   -   చెప్పి, యుద్ధము, సేన, అన్ని, ప్రసిద్ధి
 • అనువు   -   అనుకూలము, తీర్పు, అవకాశము, ఉపాయము, విధము
 • అబ్దము   -   మేఘము, సంవత్సరము
 • అభ్రకము   -   రెల్లు గడ్డి, మబ్బు, కర్పూరము, స్వర్గము, ఆకాశము
 • అమృతము   -   సుధ, పాలు, నీరు, నెయ్యి
 • గంగ   -   నది, గోదావరి, నీరు, గంగానది
 • గణము   -   జాతి, సమూహము, సమాజము, అక్షర సముదాయము
 • గతి   -   నడక, వలె, స్థితి
 • గాత్రము   -   కంఠము, దేహము, అవయవము
 • గుణము   -   స్వభావము, వింటినారి
 • గురువు   -   బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి , తాత, అన్న
 • ఘనము   -   మేఘము, గొప్ప
 • తపసు   -   తస్సు, అగ్ని, వేసవి, పక్షి
 • తమస్సు   -   చీకటి, అంధకారము, అజ్ఞానము
 • తరంగం   -   కెరటము, గుర్రపుదాటు, వస్త్రము
 • తీర్ధము   -   రేవు, పుణ్యక్షేత్రము, పవిత్ర జలము, అగ్ని
 • తెగ   -   కులము, పొడవు, పక్షము, వింటినారి
 • తోయము   -   నీరు, స్నేహము
 • త్రోవ   -   దారి, ఉపాయము, పద్ధతి
 

మొత్తం నానార్థములు - [92 నానార్థములు 4 పుటలలో ]      1 2 3 4 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: