telugudanam.com

      telugudanam.com

   

మన భాషలో ఇతర భాషా పదాలు

మనకు తెలీకుండానే మనం కొన్ని ఇతర భాషా పదాలను నిత్యం వాడుతూ ఉంటాం. భౌగోళికంగా ఇతర రాష్త్రాలతో మనకున్న సరిహద్దు సంబంధాల వల్లగానీ, వ్యాపార సంబంధాలవల్లగానీ లేక వలసలవల్లగానీ ఇతర భాషలు మన భాషలో మిళితంకావడం జరుగుతుంది. అది సంసుకుతం కావొచ్చు, తమిళం, కన్నడ, మలయాళ్లం, మరాఠి లేదా ఏ ఇతర భాషైనా కావొచ్చు. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంస్ర్కుతం : తెలుగు ప్రజల వాడుకలో సంసృత భాషా పదాలు మార్పులు చెంది ఆంధ్ర భాషలోకి అనేకం ప్రవేశించాయి.

ఉదా:

సంస్ర్కుతంలోని శూర్పణఖ తెలుగులో చుప్పనాక గానూ, రాత్రి రాతిరిగానూ, పర్వ-పబ్బం; యుగాది-ఉగాది; భట-బంటు; అటవీ-అడవి, తంత్రి-తంతి; వాట-వాడగానూ రూపాంతరంచెందాయి.


ప్రాక్రుతం :

జూద-జూదము; రాణీ-రాణి; ఠాణ-ఠాణము; కిరీడి-క్రీడి; హింగు-ఇంగువ; అరత్తియ-హారతి; హింగు-ఇంగువ


ఒరియ :

జనాబ-జనసంఖ్య; భోగట్టా-సమాచారం


మరాఠి:

కాక్డా-కాగడా; కోర్డా-కొరడా; పంచ-పంచె

ఆంధ్ర భాషకు సన్నిహితంగా ఉన్న భాషలు తమిళ కన్నడ భాషలు. ఈ భాషల ప్రభావం మన తెలుగు సాహిత్యంపై అపారంగా ఉంది.


తమిళం :

ఆళ్వార్-ఆళ్వారు; ఇడ్లి-ఇడ్లి; తిరుపతి-తిరుపతి; తిరుమలై-తిరుమల; తోమాలై-తోమాల; మాళిగై-మాళిగ; వడ-వడ; సాంబార్-సాంబారు


కన్నడ :

మజ్జిగె-మజ్జిగ; గొత్తు-గుర్తు; హంగు-హంగు; హెచ్చు-హెచ్చు;

నన్నయ మహాభారతంలోనూ, నన్నెచోడుని కుమారసంభవంలోనూ అరబీ, హింది పదాలున్నాయి. నన్నెచోడుడు "కైపు" పదాన్ని ప్రయోగించాడు. ఇది అరబీ పదం.అరబీ భాషలోని కైఫ్ పదానికి మత్తు, ఉల్లాసం అనే అర్ధాలున్నాయి. తెలుగులో ఈ పదం కైపుగా మారింది. తిక్కన భారతంలోని శాంతి పర్వంలో పారశి భాషకు చెందిన తరాజు పదాన్ని త్రాసు పదంగా ప్రయోగించాడు. 15వ శతాబ్దపు మహా కవి శ్రీనాధుడు సుల్తాన్ అను పారశీక పదాన్ని తెలుగులో సురత్రాళ, సురతాళ పదాలుగా కల్పించాదు. అలాగే మస్జిద్ అను పారసీక పదాన్ని మసీదుగా, అరబీ పదమైన అఫ్రంజ్ పదాన్ని అపరంజిగా మారింది. పారశి "కులాహ్" కుల్లాగా మారింది.

ఇంకా అనేక పదాలు నమాంతరం చెందాయి.

ఉదా:

పారశీ ఫర్ద్ తెలుగు పద్దుగానూ, జర్తార్ జలతారుగానూ, మంజిల్ మజ్లీగానూ, అరబీ అల్లాహ్ పదం అల్లా గానూ మరాయి.

భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్రల కారణంగా అరబీ, పారశీ భాషల ప్రభావం మన తెలుగు భాషపై పడగా, వర్తక వాణిజ్యాల కారణంగా పొర్చుగీసు ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి పదాలు తెలుగులోకి ప్రవేశించాయి.


తెలుగులోకి వచ్చి చేరిన పొర్చుగీసు పదాలు కొన్ని :

బంకు-బంకు; కమీజా-కమీజు; మెజా-మెజా; బొత్తాము-బొత్తాము; బిష్కోయ్తు-బిస్కత్తు; ఎష్తిరార్-ఇస్త్రి; తోవాల్య-తువాలు; బల్ది-బాల్చి; పాతు-బాతు మొదలైనవి.

ఇక ఇంగ్లీషు నుండి తెలుగులోకి వచ్చి చేరిన పదాల సంఖ్య లెక్కే లేదు. నిరక్షరాస్యులు సైతం తమకు తెలీకుండానే ఆనే నిత్యం అనేక ఇంగ్లీషు పదాలను మాట్లాడుతుంటారు.

ఈవిధంగా తెలుగు భాష అనేక భౌగోళిక, రాజకీయ కారణాలవల్ల, విదెశీయులతో జరిపిన వర్తక వాణిజ్యాల కారణంగా తనలో అనేక ఇతర భాషా పదాలను ఇముడ్చుకోని, దేశ్య, అన్యదేశ్య పదాలతో ద్రావిడ భాషలలోకెల్లా ఎక్కువ మంది మాట్లాడేవారి భాషగా విరాజిల్లుతోంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: