telugudanam.com

      telugudanam.com

   

ఆకాశం చివరంచులదాకా వెళ్ళి

[ వెనుకకు ]

ఆకాశం చివరంచులదాకా వెళ్ళి
పైలంగా తిరిగొచ్చిన పతంగి 
పిల్లోడి చేతుల్లో మళ్లీ పుట్టి పరవశించినట్టు 
అమ్మా 
నా కేరింతలు మోసిన నునూరి గాలి వొళ్ళో
మళ్ళీ సేదదీరాలని ఉందే
పడుతూ లేస్తూ
పరిగెత్తీ పరిగెత్తీ పొందిన ఈ సముద్రాని 
కంటినిండా పట్టితెచ్చి 
నీ కాళ్ళు కడగాలని ఉందే.
 

మూలం: రవి వీరెల్లి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: