telugudanam.com

      telugudanam.com

   

అక్షరం నా ఊపిరి

[ వెనుకకు ]

విశ్రాంత జీవనంలో
ఒంటరినై విలపిస్తున్నాను …
కాలం కదలడం లేదనిపిస్తోంది
ఎవడైనా ఊ కొడితేచాలు 
స్వోత్కర్ష గంటలతరబడి 
హితబోధలు విరామం లేకండా 
శ్రోతలే కరవు …..
భార్య…
ఊకదంపుడు ఆపమంటుంది 
పుత్రరత్నం …
చాదస్తం ముదిరిందంటాడు 
కోడలు 
చాకిరీకితోడు సోదొకటి …ట…
మనవరాలికి….
తాతమాట తలపోటు…
మనవడికి …
నా పలుకు పరమచిరాకు …..
కిం కర్తవ్యం …
నీరసం ఆవహించి 
దిగులుగా చూస్తూంటే …
అల్మారాలో పుస్తకం 
అభిమానంగా పలకరించింది
తోడునీడై….
నాలో ఉత్సాహాన్ని నింపింది 
అక్షరాల ఆత్మీయం ఆలింగనంతో 
మనసులో వ్యధమటుమాయం 
పుస్తక పఠనం 
వృద్ధాప్యాన్ని 
అర్ధవంతంగా తీర్చిదిద్దింది…
నేనిప్పుడు కాలాన్ని జయించాను .
 

మూలం: ఇంద్రగంటి నరసింహమూర్తి, కాకినాడ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: