telugudanam.com

      telugudanam.com

   

అర్ధం గాలికి వదలకు

[ వెనుకకు ]

పదముల గారడి చేయకు
పదపదమని తోసితోసి పలుకకు పలుకు
నదివోలిక సృజియిం పుము 
మదిలో ఏ అడ్డులేక మధుర కవితలన్‌.
అర్ధము గాలికి వదలకు
వ్యర్ధ పదమ్ములను కుప్పవలె పోయకుమా!
సార్ధక రచనలనీయము 
అర్ధించడి పాఠకాళి  ఆనందింపన్‌
రాసిని చూడకు  కవితల 
వాసిగనున్నట్టి చిన్న వచనంబైనన్‌
భాసిల్లును మంచి కవిత పదికాలమ్ముల్‌ 

నన్నయలున్నారిప్పుడు 
చిన్నయ్యలు ఊరికొకరు సిరులై నిలువన్‌
మిన్నుల వెలిగెడి తారల 
విన్నాణము తీరు తెలుగు వీధి వెలుంగున్‌
కవితలు రాయుము తెలుగున 
భువిలో నసమాన దీప్తి  పొంగులువారన్‌
సువచన పధ్యము గేయము 
నవనవభావాళి యెదుట నర్తన సేయన్‌ 

మూలం: అయాచితం నటేశ్వర శర్మ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: