telugudanam.com

      telugudanam.com

   

ఆవును నేను పిసినారినే

[ వెనుకకు ]

జేబులోని బోట్లన్నీ
ఖర్చయిపోయాయి
ఇక మిగిలినవి చిల్లర పైసలు 
బిడ్డా!
ఇప్పుడు నన్ను ఉదారంగా ఉండమంటావా
నీతోపాటు పరిగెత్తమంటావా!!
వత్సరాలెన్నో 
ఆకుల్లా రాలిపోయాయి 
వసంతాలు వెదజల్లిన జ్ఞాపకాలు 
కాస్తకాస్త వెలిసిపోయాయి 
నన్నిప్పుడు  నీతోపాటు 
కలలుగనమంటావా
బిగించిన తీగల్లా మోగే నరాలు 
బిగ్గరగా అరవలేకపోతున్నాయి 
బకప్పుడు రగిలిన క్షణాలు 
కాలం చీకటిలో కలిసిపోతున్నాయి 
దూరాలను చూస్తే కాళ్లు భయపడుతున్నాయి 
ముదిమి వయస్సు ఎదురొచ్చే వేళ 
ముఖం చాటెయ్యడం కష్టమే 
వీనస్‌ పిలిచినా స్పందించలేను 
బోనస్‌తో వెళ్లదీస్తున్నాను 
అయితే ఒక్కటి !
మిగిలిన కొద్దిపాటి సూర్యోదయాలతో 
లోకం లో 
మూలమూఅలలా వున్న చీకటిని దులిపేస్తాను 
మానవాళి భవిష్యత్తు కోసం 
అనుభవాల విత్తులు నాటుతాను 
బాబూ!
ఇక నా విలువైన కాలమంతా మీకే
మీతోపాతు వచ్చేది అందాకే
కాదనను నేను పిసినారినే
అయితే 
పరోపకార కిరీటధారిని కూడా
 

మూలం: డా.ఎన్‌.గోపి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: