telugudanam.com

      telugudanam.com

   

అమ్మ

[ వెనుకకు ]

ఎవరు నేర్పారమ్మ ఈ భాషను?
అమ్మ నేర్పందమ్మ ఈ తెగును !
మాధుర్య పదజాల మవికొమ్మల పూల 
తావి అంతా తెచ్చు ఈ పునుగును 
అమ్మ నేర్పందమ్మ ఈ తెగును !
ఎవరు కూర్చారమ్మ లిపిలోని అందాలు 
అచ్చులతో తేనె ఊటలోనే అద్ది 
కమ్మనైనది భాష కవుల కలమున దిద్ది 
ఎందరో అద్దారు ఈ సొగసును 
అమ్మ నేర్పందమ్మ ఈ తెగును !
అందరూ మెచ్చేలా చేర్చారు జిలుగును 
అమ్మ నేర్పందమ్మ ఈ తెగును !
 

మూలం: అపరుసు రమాకాంతారావు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: