telugudanam.com

      telugudanam.com

   

ఎడబాటు . . . . . . !

[ వెనుకకు ]

నీకై వేచి ఉన్నాను అమావాస్య చీకట్లో . . . ,
      వెలుగుని పంచే చంద్రుడివై నువ్వు వస్తావని . . . ! 
నీకై వేచి ఉన్నాను గమ్యం తెలియని బాటసారినై . . . , 
      నా గమ్యం నీవై నన్ను నడిపిస్తావని . . . !
నీకై వేచి ఉన్నాను తోడు లేని ఒంటరినై . . . , 
      నా తోడు నా నీడ నీవై నాతో ఉంటావని . . . ! 
నీకై వేచి ఉన్నాను మనసు లేని మనిషిలా . . , 
   ప్రాణం లేని దేహంలా . . . , 
      నా మనసు నా ప్రాణం నీవై నన్ను ప్రేమిస్తావని . . . ! 
నేను వేచి ఉంటాను నీకై నా కడవరకూ . . . , 
   ఈ కల తీరే వరకు . . . . . . . . ! 
. 
 

మూలం: గౌతమి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: