telugudanam.com

      telugudanam.com

   

ఇదేమి వింత

[ వెనుకకు ]

ఆకులు రాలిన మోడు
అంతలోనే చిగురించిందట !
ఆ చిగురులోని వగరు మింగిన 
నల్లని గొంతు తియ్యగా పాడిందట!
ఇదేమి వింత 
కరడు గట్టిన కరిమబ్బు 
తన ఒకపాటి కాఠిన్యానికి తనే 
భయపడి కన్నీరు కార్చిందిట!
గోరు వెచ్చని ఆ కన్నీటితో
తలంటు పోసుకున్న ఓ
పిల్ల విత్తు మొలకలెత్తి 
నేల తల్లినే కబళించిందట 
ఇదేమి వింత!
 

మూలం: పి.భారతీకృష్ణ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: