telugudanam.com

      telugudanam.com

   

ఇంత నిశ్శబ్ధమైతే ఎలా?

[ వెనుకకు ]

ఎంత నిశ్శబ్ధంగా ఉంది వాతవరణం
పువ్వు రాలితే వినిపించేటట్లుగా వుంది 
మెత్తమెత్తగా ప్రసరించే గాలి 
తన ఊపిరి బిగించుకుని 
సాగుతుంది 
ఊరపిచ్చ్జుకలు తమ స్వరాలను 
కుదించుకుని 
కొమ్మల మాటున దాక్కున్నాయి.
మంచుగడ్డలాడుకునే గుసగుసలు కూడా
మౌనంలోకి జారిపోతున్నాయి 
ఇంత నిశ్శబ్ధమైతే ఎలా?
ఇది ఇలాగే కొనసాగితే 
క్రమక్రమంగా మృత్యువు 
కమ్ముకున్నట్టుగా వుంటుంది 
శ్రుతిపక్వంగా పలికే శబ్ధంలో 
జీవశక్తి వుంది.
అది వెదురు కొయ్యల్లో నుంచి వెలువడితే 
ప్రాణాలను ఊయలలూ పే
వేణుగానమవుతుంది.
జలజలా పారే సెలయేటి గలగలల్లో 
కదలాడితే
హృదయాలను పలికించే
మృదంగ నాదమువుతుంది 
ఆత్మీయల పరస్పర సంభాషణల్లో
అల్లుకునే శబ్ధం 
ప్రగాఢ మైత్రికి మూలసూత్రమవుతుంది.
నిర్హేతుక నిశ్శబ్ధం 
శూన్యంలో కలిసిపోవాలి 
అర్ధవంతంగా కుదురుకునే నిశ్శబ్ధం 
వినూతన శబ్ధ సృష్టికి 
మౌలిక ప్రేరణ కావాలి.
 

మూలం: డా|| సి. నారాయణరెడ్డి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: