telugudanam.com

      telugudanam.com

   

ఎడారి ఎండమావులు

[ వెనుకకు ]

ఆ ఊరి గడప గడపకూ
గాయల కుంకుమ బొట్లు 
ఇంటింటికి 
ఎడారి మంటలు సలపరింత 
అందరి వాకిళ్ల
సానుపు ల్లోనూ కన్నీళ్ల తడి 
మనిషి మనిషికీ
మనస్సుకు పట్టని అవస్ధ 
ఏజంట్ల వీసాల మోసాలు 
విమానం దిగంగనే
కల్లబొల్లి కల్లోల కొలువులు 
బతుకపోయి బతుకవోయి 
అప్పులన్న తేర్పుతడనుకుంటే
అందమైన పెట్టెల 
శవమై వచ్చిన పెనిమిటి 
ఆమె శోకం ఆపరతంకాని దుక్కపాతాం 
ఏ గుండెను కదిలించినా
దుబయ్‌ మస్కట్‌ బాధల గాధలే
పొందింది తక్కువ 
పోగొట్టుకున్నది ఎక్కువ 
రంగు నర్సయ్య తేల్చిన 
వలస సంపాదనల సారాంశం 
బట్టా పొట్ట అగ్గిపెట్టె బీడి కట్ట 
ఊరడి లచ్చవ్వ కండ్ల నిండా నీళ్లు 
చేసిన పుట్టెడు బాకీలు తీర్చ 
కొడుకులిద్దరూ మళ్లా అవుటాఫ్‌
అమర వీరుల స్ధూపాల సాక్షిగా
అలుముకున్న పేదరికం సాక్షిగా
దేశాలు పట్కొని తిరిగి తిరిగి
ఆ ఊరి 
బాల్యం యవ్వనం కరిగిపోయినయి 
వృద్ధాప్య ఛాయలే మిగిలినయ్‌
జీవితంలోనే జీవంలేని తనాన్ని 
దర్శిస్తున్న విచిత్ర వైనమిది.
 

మూలం: అన్నవరాం దేవేందర్‌

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: