telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

క నుంచి ఘ వరకు - [129 సామెతలు 9 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 > >>  

  • కంటికి ఇంపయితే కంచానికీ ఇంపు.
  • కందకి లేని దురద కత్తిపీటకా.
  • కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
  • కట్టిన ఇంటికి వంకలు చెప్పేవారు వెయ్యిమంది.
  • కట్టిన వాడికి ఒక ఇల్లు అయితే కట్టని వాడికి వంద ఇళ్లు.
  • కట్టిన వారు ఒకరైతే కాపురం చేసేవారు మరొకరు.
  • కట్టె వంక పొయ్యి తీరుస్తున్నది.
  • కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ.
  • కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు.
  • కడుపు నిండిన బేరము.
  • కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా...వొండుకున్నమ్మ తినక మానుతుందా.
  • కడుపులోని మాట అంటే ఊరంతా పాకుతుంది.
  • కత్తి తీసి కంపలో వేసి ఏకుతో పొడుచుకున్నట్లు.
  • కత్తి పదునా? కలం పదునా?
  • కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు

క నుంచి ఘ వరకు - [129 సామెతలు 9 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: