telugudanam.com

      telugudanam.com

   

సామెతలు

 

చ నుంచి జ వరకు - [83 సామెతలు 6 పుటలలో ]      1 2 3 4 5 6 > >>  

  • చంక లోతుకు దిగిన వాడికి చలేమిటి?
  • చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా గాలించినట్లు.
  • చంద్రుని చూచి కుక్కలు మొరిగినట్టు.
  • చక్కనమ్మ చిక్కినా చక్కనే (అందమే).
  • చక్కని రాజమార్గముండగా సందుల్లో దూరడమెందుకు?
  • చక్కెర తిన్న నోటితో తవుడు బొక్కినట్లు.
  • చక్కెర పందిట్లో తేనెవాన కురిసినట్లు.
  • చచ్చిన పామును కొట్టడానికి అందరు తయారు.
  • చచ్చిన వాని కండ్లు చారెడు.
  • చచ్చిన వాని పెండ్లికి వచ్చిందే కట్నం .
  • చచ్చేంత వరకు వైద్యుడు విడిచిపెట్టడు, చచ్చినా పురోహితుడు విడిచి పెట్టడు.
  • చదవేస్తే ఉన్న మతి పోయింది.
  • చదివినవానికన్నా చాకలి నయము.
  • చదువు కన్న గొప్ప ధనం లేదు.
  • చదువు చారెడు... బలపాలు దోసెడు...

చ నుంచి జ వరకు - [83 సామెతలు 6 పుటలలో ]      1 2 3 4 5 6 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: