telugudanam.com

      telugudanam.com

   

అడకత్తెరలో పోకచెక్క

సాధారణంగా కత్తెర గురించి తెలిసే ఉంటుంది. బట్టలు, పేపర్లు, కవర్లను కత్తిరించడానికి వాడుతుంటాం. అలాగే తినే వక్కలను విరగొట్టడానికి అడకత్తెరను వాడతారు. ఇది బాగా దృఢంగా ఉంటుంది. అడకత్తెరలో వక్కను పెట్టి వత్తితే రెండువైపులా ఒత్తిడి ఎక్కువై ఎటూ తప్పించుకోలేక విరిగిపోతుంది. మనకు బాగా కావలసిన ఇద్దరు వ్యక్తుల మధ్య కలతలు వచ్చినప్పుడు, మనం వాటిని పరిష్కరించడానికి వెళితే ఇద్దరికీ చెప్పలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇద్దరి నుంచీ తిట్లను భరించాల్సి వస్తుంది. అప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది నా పరిస్థితి అని ఈ సామెత వాడుతుంటారు.


మూలం : 21-11-08, శుక్రవారం, సాక్షి, ఫ్యామిలి.

[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: