telugudanam.com

      telugudanam.com

   

అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత పెరుగుతుంది

అందరికీ అన్నీ తెలియవు. ఒక రంగంలో నిష్ణాతుడైన వ్యక్తికి మరొక రంగంలో ఓనమాలు కూడా తెలియక పోవచ్చు. అదెలాగంటే సంధర్భానుసారంగా ఆశువుగా కవితలు చెప్పగలిగిన అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌కి కంప్యూటర్‌ను ఎలా వాడాలో తెలియదట. ఇలా అందరూ ఒప్పుకోరు. చాలా మంది ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు తనకు తెలియదని చెప్తే విన్న వాళ్లు ఇది కూడా తెలియదా అని చులకనగా చూస్తారన్న అపోహతో ఆ విషయాన్ని బయటపెట్టరు. అలాంటప్పుడు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు కదా! అలా చేయకూడదని చెప్పడమే ఈ సూక్తి భావం. అజ్ఞానాన్ని దాచినందువల్ల ప్రయోజనం ఉండదు. తమకు తెలియని అంశం గురించి నిజాయితీగా చెప్పినప్పుడు దానిని తెలిసిన వాళ్లు తెలియ చెప్పే అవకాశం ఉంటుంది.


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: