telugudanam.com

      telugudanam.com

   

అజ్ఞానులు గతాన్ని, బుద్ధిమంతులు వర్తమానాన్ని, మూర్ఘులు భవిష్యత్తును మాట్లాడతారు

గడిచిపోయిన రోజులలో చేసిన పనుల గురించి చెప్పుకుంటూ కాలం గడిపేవాళ్లను అజ్ఞానులు గానూ, వర్తమానం లో అంటే ప్రస్తుతం చేయాల్సిన పనుల గురించి, వాటిని ఎలా చేయాలా? అని ఆలోచిస్తూ ఆ మేరకు మాట్లాడే వాళ్లను బుద్ధిమంతులుగానూ, భవిష్యత్తులో నేనిలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటూన్నాను, అని కబుర్లు చెప్పే వాళ్లను మూర్ఘులుగాను పరిగణిస్తారు. చేయాల్సిన పని గురించి మాట్లాడాలి. మిగిలినవన్నీ ఎందుకూ పనికిరాని మాటలని అర్ధం. నేను రెండో తరగతిలో ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకున్నాను తెలుసా? అని చెప్పడం వల్ల ఇప్పుడు మార్కులు రావు. అలాగే నేను నెక్ట్స్‌ ఇయర్‌ బాగా చదివి క్లాస్‌లో మొదటి స్ధానం లో ఉంటానని ధీమాగా చెప్పడం వల్ల ఇప్పుడు మంచి మార్కులు వస్తాయా?అందుకే అప్పుడు ఏం చేయాలో అది మాత్రమే చేయాలి. అందుకు తగినంత మాట్లాడాలి.


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: