telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.
 • తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
 • నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.
 • మన వెనుక కూడా మనల్ని గురించి మంచిగా మాట్లాడే వాడే మంచి స్నేహితుడు.
 • వంట రుచి తిన్నప్పుడే బుజువు అవుతుంది.
 • ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.
 • మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము
 • నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను
 • డబ్బుపట్ల వ్యామోహమే అన్ని అనర్ధాలకు మూలం.
 • తెలివికంటే కూడా గుణశీలాలే గొప్పవి.
 • సంతృప్తికి మించిన ఆనందం వేరొకటి లేదు.
 • ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం అత్యంత భారీనష్టం.
 • మెత్తటి జవాబు కోపాన్ని పారద్రోలుతుంది.
 • మనిషి పనులే అతడి ఆలోచనల ఉత్తమ వ్యాఖ్యాతలు.
 • ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: