telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

అ నుంచి అః వరకు - [395 సూక్తులు 27 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.
 • ఇక్కడి సూర్యాస్తమయం ప్రపంచపు మరో వైపుకు చెందిన సూర్యోదయం.
 • అవసరంలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు.
 • అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
 • అనైతికతతో కూడిన ఆలోచనలు, నైతిక పనులవైపు మనల్ని తీసుకుని పోలేవు.
 • అదృష్టం కారణంగా తల్లితండ్రులు మనకు లభ్యమౌతారు. కానీ మిత్రులు మాత్రం మన ఎన్నిక కారణంగానే లభ్యమవుతారు.
 • ఈ రోజన్నది నిన్నటి రోజును గురించి దిగులుపడిన రేపు అవుతుంది.
 • ఒంటరిగా ఉండగల సామర్ధాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి.
 • అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.
 • అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.
 • అవసరమైనదాని విలున. అది లోపించినప్పుడే అర్ధం అవుతుంది.
 • ఏకాగ్రత గెలుపు తాళం చెవి. కుడి ఎడమలు చూడకుండా నేరుగా బిందువు వైపు సాగిపోండి.
 • ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
 • ఆలోచనల ఫలితమే మనిషి.
 • ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.

అ నుంచి అః వరకు - [395 సూక్తులు 27 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: