telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

ప నుంచి మ వరకు - [520 సూక్తులు 35 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • ప్రతిరోజున అదే మన జీవితపు ఆఖలి రోజుగా భావించి గడపాలి.
 • ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు.
 • బాగా చేసిన పనికి తగిన బహుమతి ఆ పనిని పూర్తి చేయడమే.
 • మీకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా తీరికలేని సమయమే విశ్రమించే సమయం అవుతుంది.
 • ప్రగతికి తగిన ఉన్నతి, ఉన్నతికి తగిన ఉదారతే ఉత్తమ పురుష లక్షణం.
 • మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
 • పనికి ప్రత్యామ్నాయం లేనే లేదు. గెలుపుకు అది మీరు చెల్లించే ధర.
 • ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.
 • మనసుంటే మాత్రం తానుగా అది దారిని ఏర్పాటు చేసుకుంటుంది.
 • మనకు ఇష్టమైనది మనవద్ద లేనప్పుడు మన దగ్గరున్నదాన్నే ఇష్టపడాల్సి ఉంటుంది.
 • మీరు ప్రార్ధన చేసినంతగా శ్రమ పడకాపోతే మీ ప్రార్ధనలు ఆలకించబడవు.
 • మూర్ఖులే ఎక్కువ ఆర్భాటాన్ని చేస్తారు.
 • మీరు వదులుకోగల దాన్నే అరువివ్వండి.
 • మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
 • ప్రస్తుతానికి మించిన సమయం మరేదీ ఉండదు.

ప నుంచి మ వరకు - [520 సూక్తులు 35 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: