telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

య నుంచి ఱ వరకు - [294 సూక్తులు 20 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

  • వంటవాళ్లు ఎక్కువైతే వంటకం పాడవుతుంది.
  • హృదయానికి భాషలు లేవు. అది హృదయాలకు హత్తుకునిపోయే భాషను మాట్లాడుతుంది.
  • సరి పుచ్చుకున్న స్నేహితుడు రెండింతల శత్రువు.
  • శారీరక మానసిక ఆరోగ్యాలు ఒకదానితో మరొకటి కలసి ఉంటాయి.
  • విమర్శకు గురికాకుండా ఉండాలంటే ఏమీ చేయకండి. ఏమీ చెప్పకండి. అనామకుడిగా ఉండండి.
  • వినయంతో కూడిన హృదయం గొప్ప హృదయం. చాలా సరళంగా వున్న మనిషి సాధారణంగా గొప్ప వాడౌతాడు.
  • వంతెనలకు కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
  • సాధుపుంగవుడు తన ఉపదేశాలకు అనుగుణంగా జీవిస్తాడు. తను జీవించే విధంగా ఇతరులకు ఉపదేశాలను ఇస్తాడు.
  • రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.
  • వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.
  • సతత ప్రయత్నం నైపుణ్యాన్ని కూడా అధిగమిస్తుంది.
  • సొందర్యంతో కూడిన వస్తువు నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది.
  • వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.
  • హృదయంలో చోటుంటే ఇంటిలో తప్పకుండా చోటు ఉంటుంది.
  • విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.

య నుంచి ఱ వరకు - [294 సూక్తులు 20 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: