telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

 • మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.
 • ఈ రోజు పనిని చాలా బాగా చేయడమన్నదే రేపటి కోసం ఉత్తమమైన తయారీ అవుతుంది.
 • ప్రతి వ్యక్తి వద్ద ఒకేలాంటి సమయం ఉంటుంది. మన సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామనదే గణనీయమైనది.
 • మన పిల్లలకు ఏమి ఆలోచించాలని కాదు ఎలా ఆలోచించాలన్నది నేర్పాలి.
 • అదృష్టం కారణంగా తల్లితండ్రులు మనకు లభ్యమౌతారు. కానీ మిత్రులు మాత్రం మన ఎన్నిక కారణంగానే లభ్యమవుతారు.
 • ఏదైనా కానివ్వాండి అతి అన్నది చెడ్డది.
 • సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.
 • మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
 • పోగొట్టుకోనంతవరకు మనవద్దనున్న వస్తువులను గురించి మనం తెలుసుకోలేము.
 • లక్ష్యం పట్ల ఉన్న స్ధిరత్వం పైనే గెలుపు రసహ్యం దాగుంటుంది.
 • మౌనంగా పాటిస్తున్నంత వరకు మూర్ఖుడు కూడా పండితుడిగా భావింపబడతాడు.
 • తెలియని మూర్ఖుని కంటే అన్ని తెలిసిన మూర్ఖుడు అవివేకుడు.
 • క్లుప్తంగా మాట్లాడడం వివేకవంతుడి గుణం అవుతుంది.
 • శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.
 • నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: