telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 10 11 12 13 14 15 16 17 18 19 > >>  

 • బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
 • విమర్శలు కంటే కూడా పిల్లలకు ఆదర్శవంతుల అవసరం ఎక్కువగా ఉంటుంది.
 • నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
 • యవ్వనం పొరబాటు, మగతనం పెనుగులాట, ముసలితనం పశ్చాత్తాపం.
 • గొప్పగా చేయాలన్న కోరికను కలిగి ఉండడం కంటే ఉడుతాభక్తిగా దేన్నైనా చేయడం మరీ మంచిది.
 • మీరు సరి అయినప్పుడు మీరు ఒప్పుకోని విషయాలకు సంబంధించిన చర్చను మానేయండి.
 • నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
 • తమ హక్కులను రక్షించుకొనగలవారికే హక్కులు ఉంటాయి.
 • కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
 • కష్టాల పాఠశాలలోనే క్రమశిక్షణ నేర్చుకోబడుతుంది.
 • సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.
 • మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము
 • అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
 • మంచి పరిణామాలు చెడు సాధనాలను సమర్ధించలేవు. అదేవిధంగా చెడు ప్రారంభం ఎప్పటికీ మంచి ముగింపును ఇవ్వలేదు.
 • వంతెనలకు కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 10 11 12 13 14 15 16 17 18 19 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: