telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 115    

 • బదులుకు బదులు తడబడకుండా ఇచ్చే నాలుకను కాకుండా సహాయాన్ని అందించే చేతిని నాకివ్వండి.
 • దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు.
 • బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.
 • మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.
 • నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.
 • గొప్ప ఆలోచనలను కలిగి ఉన్న వారు ఒంటరిగా ఎన్నటికీ ఉండరు.
 • గురి చూడడమే సరిపోదు, గురిని చేదించగలగాలి.
 • నమ్మకం అన్నది మనకు వెలుగు నివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి.
 • జీవితం నుండీ పారిపోవడం పిరికితనం.
 • ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది.
 • ఒక అబద్దపు మిత్రుడు నూరుమంది శత్రువులకంటే కూడా ఎక్కువ హాని చేయగలడు.
 • పెరిగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కువ అపాయకరం.
 • సత్యానికి మించిన ఉత్తమమైన మతం వేరొకటి లేదు.
 • బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.
 • మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 115    

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: