telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 2 3 4 5 6 7 8 9 10 11 > >>  

 • మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.
 • పని చేసే వేళలో పని, ఆటలు ఆడే సమయంలో ఆటలు ఆడండి.
 • ఆశావాది గులాబీని చూస్తే నిరాశావాది ముళ్ళను చూస్తాడు.
 • మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే.
 • నిజమైన స్నేహం బంగారం లాంటిది.పాతదయినంత మాత్రనా దాని విలువ తరగదు.
 • మంచి చెడు అన్నవి లేవు. ఆలోచనలే మంచినీ, చెడునూ చేస్తాయి.
 • మితము తప్పితే అమృతమైనా విషమే.
 • మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.
 • ఓటమి అన్నది గెలుపుకు మీరు చెల్లించే ట్యూషన్‌ ఫీజు.
 • పోటీ కంటే కూడా సహకారం చాలా ముఖ్యమైనది.
 • పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.
 • ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.
 • చెడుకు తానుగా నిలబడేందుకు కాళ్ళు ఉండవు.
 • పది వాదనల కంటే ఒక నిదర్శం మెరుగైనది.
 • గుడ్డును దొంగిలించేవాడు గుర్రాన్ని కూడా దొంగిలించగలడు.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 2 3 4 5 6 7 8 9 10 11 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: