telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 3 4 5 6 7 8 9 10 11 12 > >>  

 • శతృత్వం అన్నది మూర్ఖుల వృత్తి.
 • సాహసించని వాడు గెలుపును సాధించలేడు.
 • చాలాకాలం వరకు కొనసాగే అలవాటే మనిషి గుణం అవుతుంది.
 • నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
 • అప్పుడప్పుడు అవకాశం అన్నది మారువేషంలో వస్తుంది. ఇదే దానితో వచ్చిన పెద్ద చిక్కు.
 • ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.
 • అనుభవం అన్నది విలువైన అధ్యాపకుడి లాంటిది.
 • తప్పు చేయని వారు ధరణిలో లేరు.
 • అహంభావం లేనప్పుడు మీరు ముందుకు సాగుతారు. అహాంభావంతో మీరు ముందుక్కు సాగలేరు.
 • మాటలు కంటే చేతలు మెరుగైనవి. గొప్పలు చెప్పుకోవడం కంటే పనులు చాలా గొప్పవి.
 • అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
 • చెడు మాటలు కత్తి కంతే పదునైన గయాన్ని చేస్తాయి
 • మానవ చరిత్ర రోజురోజుకూ చదువుకూ. దుర్గతికీ మధ్య నడిచే పరుగుపందెంగా తయారవుతోంది.
 • ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.
 • శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 3 4 5 6 7 8 9 10 11 12 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: