telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 5 6 7 8 9 10 11 12 13 14 > >>  

 • చిన్న చిన్నగా పడే గొడ్డలి పెట్లే మర్రివృక్షాన్ని కూల్చి వేస్తాయి.
 • ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలని మీరు ఆశిస్తారో అలాగే ఇతరుల పట్ల మీరు వ్యవహరించండి.
 • ప్రతిభ గొప్ప పనులను ప్రారంభిస్తుంది. శ్రమే వాటిని పూర్తి చేస్తుంది.
 • ఈ ప్రపంచంలో మనం వదులుకునేవే మనల్ని ధనవంతుల్ని చేస్తాయి.
 • అహంభావం లేనప్పుడు మీరు ముందుకు సాగుతారు. అహాంభావంతో మీరు ముందుక్కు సాగలేరు.
 • పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.
 • నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.
 • ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
 • నవ్వుతూ ఓడిపోయే వాడే గెలుపును సాధించే వ్యక్తి.
 • మనం నిజంగా ఏమో అదే మన గుణం. మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో అదే మన నడత.
 • భగవంతుడు అన్నిచోట్లా ఉండలేకపోయాడు. అందుకే అమ్మను అతడు సృష్టి చేసాడు.
 • ఈ రోజు మనం గతం శిఖరాలపై నిలుచుంటాము. కానీ ఇవి రేపటి పర్వత పద ప్రాంతాలవుతాయి.
 • మనసన్నది బంగారం గనితోపాటు ఒక చెత్తకుండి కూడా.
 • కర్తవ్యమే హక్కుల నిజమైన ఆచారం.
 • మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 5 6 7 8 9 10 11 12 13 14 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: