telugudanam.com

      telugudanam.com

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 9 10 11 12 13 14 15 16 17 18 > >>  

 • ఆడది మగవాడిని మెత్తగా మార్చాలి కాని బలహీనుడిగా కాదు.
 • యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.
 • ఇతరులను గురించి మంచిగా మాట్లాడడం మీ గురించి మంచిగా మాట్లాడడం అవుతుంది.
 • మంచితనం ఉన్నవారు తమ బాధ్యతలను నిర్వహిస్తారు. మంచితనం లేనివారు తమ హక్కులపై దృష్టిని నిలుపుతారు.
 • గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
 • తప్పులకు ఒప్పుకోవడం అన్నది మాలిన్యాన్ని తుడిచివేసే చీపురు అవుతుంది.
 • పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
 • వాత్సల్యం న్యాయాన్ని గుడ్డిదానిగా మారుస్తుంది.
 • మిమ్మల్ని కనిపెట్టనప్పుడు బాగా శ్రమించి పనిచేయండి.
 • మూర్ఖుడి హృదయం నోటిలో ఉంటుంది. కానీ వివేకవంతుడి హృదయంలో నోరు ఉంటుంది.
 • మీరు వదులుకోగల దాన్నే అరువివ్వండి.
 • కళ సుదీర్ఘం, జీవితం అల్పం.
 • సమయం గడియారం ద్వారా కాకుండా విసుగు ద్వారా కొలవబతుంది.
 • మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.
 • ఆజ్ఞాపాలన తెలిసిన వ్యక్తికి ఆజ్ఞను ఇవ్వడం కూడా తెలిసి ఉంటుంది.

మొత్తం సూక్తులు - [1725 సూక్తులు 115 పుటలలో ]    << < 9 10 11 12 13 14 15 16 17 18 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: