telugudanam.com

      telugudanam.com

   

శ్రీకృష్ణావతారం-పాత్రలు-ముఖ్యాంశాలు

శ్రీకృష్ణ

కంసుడు ఏ దేశానికి రాజు?

మధుర.


కంసుడి తండ్రి?

ఉగ్రసేన మహారాజు.


కంసుడి తల్లి?

పద్మావతి.


కంసుడి భార్యలు?

ఆస్తి, ప్రాప్తి.


ఆస్తి, ప్రాప్తి ఎవరి కుమార్తెలు?

జరాసంధుడు.


కంసుడి రాజ గురువు?

గర్గ మహర్షి.


కంసుడి చెల్లి?

దేవకి.


దేవకి భర్త?

వసుదేవుడు.


వసుదేవుడి పెద్ద భార్య?

రోహిణి.


వసుదేవుడి తండ్రి?

శూరసేన మహారాజు.


ఆనకదుందుభి ఎవరు?

వసుదేవుడు. (వసుదేవుడు పుట్టినపుడు దేవదుందుభులు మ్రోగాయి. అందువలన ఆయనకు ఆ పేరు వచ్చింది).


కంసుడు దేవకీ వసుదేవులను రధాన ఎక్కించుకుని దేవకి అత్తవారి తీసుకువెళ్తుండగా ఆకాశవాణి ఏమంది?

దేవకి ఎనిమిదవ గర్భాన పుట్టే వాడు నిన్ను సంహరిస్తాడు అని.


శుక్రాచార్యుడు ఎవరి కొడుకు?

భృగుమహర్షి.


శుక్రాచార్యుడి కూతురు?

దేవయాని.


యయాతి ఎవరి కొడుకు?

నహుషుడి కొడుకు.


నందుడు ఎక్కడివాడు?

వ్రేపల్లె.


మొదట క్షమించిన కంసుడు దేవకి ఆరుగురు బిడ్డలను ఒకేమారు ఎందుకు వధించాడు?

ఎనిమిదవ వాడు ఎవరు అనే సందేహంతో. వాడు మొదటినుంచి ఎనిమిదవవాడా లేక ఎనిమిదవవాడినుంచి మొదటివాడా? లేక మధ్యముడినుంచి ఎనిమిదవవాడా అనే సందిగ్ధంలో పడి అందర్నీ ఒకేసారి వధించాడు.(దేవకీకి ఏడవ గర్భమున శిశువిచ్చిత్తి జరగ్గా ఎనిమిదవ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడు.)అతడిని వసుదేవుడు యమున దాటించి వ్రేపల్లెకు చేరి యశోద ప్రక్కన పరుండబెట్టి, యశోదకు జన్మించిన ఆడ శిశువును తీసుకోని మరలా మధురకు వచ్చాడు.)


వ్రేపల్లె నుంచి వసుదేవుడు తీసుకొచ్చిన బిడ్డను ఎనిమిదవ బిడ్డగా భావించిన కంసుడు ఏమి చేశాడు?

ఆ బిడ్డను వధించబోగా ఆ బాల మాయాదేవిగా రూపొంది, "నిన్ను తుదముట్టించేవాడు మరోచోట పెరుగుతున్నాడు, ఆ బాలుడి చేతిలో నీకు చావు తప్పదు" అని అదృశ్యమవుతుంది. దాంతో కంసుడు గత నాలుగైదునాళ్ళలో పుట్టిన పసిపిల్లలందరినీ చంపమని ఆదేశిస్తాడు.


కంసుడి మంత్రి?

కేశి.


పూర్వజన్మలో పూతన ఎవరు?

బలి చక్రవర్తి కూతురు రత్నమాల.


పూర్వజన్మలో శకటాసురుడు ఎవరు?

హిరణ్యాక్షుని కుమారుడు ఉత్కచుడు.


రాధ తండ్రి?

వృషభానుడు

యశోద శ్రీకృష్ణుని నడుముకి రోలుకి కట్టేసినప్పుడు, కృష్ణుడు రోలు లాగుతూ రెండు చెట్ల మధ్యకు వచ్చాడు. నడుముతో ఒక్క గుంజు గుంజగానే, చెట్లు మొదళ్ళతో కూలిపోయి,ఇద్దరు గంధర్వులకు శాప విమోచనం అయ్యింది. ఆ గంధర్వుల పేరులు నలకూబరుడు, మణిగ్రీవుడు.


పూర్జన్మలో యశోద ఎవరు?

ధరాదేవి.


వ్రేపల్లె వాసులు వ్రేపల్లెను వదిలి బృందావనం ఎందుకు బయల్దేరాల్సివచ్చింది?

శ్రీ కృష్ణుడు పుట్టిన దగ్గర్నుంచీ ఆయనకు అడుగడునా గండాలు ఎదురవుతుండడంతో నందరాజు తన పరివారము మరియు గోగణంతోసహా మధుర మండలంలోని బృందావనంకు తరలివెళ్ళారు.

కృష్ణుడే దేవకి 8వ గర్భాన జన్మించినవాడని వసుదేవుని హింసించి తెలుసుకుని దేవకీ వసుదేవులిద్దరినీ చెరసాలలో పెట్టిస్తాడు కంసుడు. ఆవెంటనే బలరామకృష్ణులకు సన్మానం చేయాలనీ, వారికి అనేక బహుమతులు కూడా ఇవ్వడానికి నిర్ణయించినట్లు చెప్పవలసిందిగా అక్రూరుడిని ఆజ్ఞాపించి, వారిని మధురకు తీసుకురాలసిందిగా అతడిని వ్రేపల్లెకు పంపిస్తాడు. అక్రూరుడు కంసుడికి మహామంత్రి. వసుదేవుడి స్నేహితుడు.


యశోద, నందులకు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల బిడ్డని ఎవరి ద్వారా తెలుస్తుంది?

అక్రూరుడు.


గత జన్మలో కుబ్జ ఎవరు?

శూర్పణఖ.


కంసుడు ఏ మల్లయోధులను కృష్ణ బలరాముల మీదకు ఉసిగొల్పాడు?

చాణూరుడు, ముష్టికుడు.


శ్రీకృష్ణుడు, సుదాముడు ఎవరి వద్ద వేద విద్యనభ్యసించారు?

సాందీపుని వద్ద.


సుదాముని మరో పేరు?

కుచేలుడు.


జరాసంధుడు శ్రీ కృష్ణునితో ఎన్నిసార్లు యుద్ధం చేశాడు?

17సార్లు.


బలరాముడి భార్య?

రేవతి


రుక్మిణి ఎవరు?

విదర్భ దేశ రాజు భీష్మకుడి కుమార్తె.


సత్యభామ ఎవరి కూతురు?

సత్రాజిత్తు కూతురు.


సత్రాజిత్తు శమంతకమణిని ఎవరి వద్దనుండి పొందాడు?

సూర్య భగవానుడు.


సత్రాజిత్తుని తమ్ముడు?

ప్రసేనుడు.


శ్రీ కృష్ణుని అష్ట భార్యలు ఎవరు?

రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, భద్రాదేవి, నాగ్నజితి, లక్షణ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: