telugudanam.com

      telugudanam.com

   

హరికథ

ఈ కళా రూపంలో ఒకే కథకుడు దాదాపు మూడు గంటలకుపైగా గానం చేస్తాడు. ఆకర్షణీయమైన ఆహార్యంతో ప్రేక్షకులకు విసుగు కలగకుండా చేతిలో చిరతలతో ఆయన చేసే కథా కాలక్షేపం వేదాంత సహితంగా ఉంటుంది. సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం వంటి అనేక ఆధ్యాత్మిక సంబధిత పురాణేతిహాసాలలొనై కథలను అత్యంత రమణీయంగా ఆలపిస్తూ, భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ వీరు చేసే గానం ప్రజలను ముక్తి మార్గంపట్ల పయనించేటట్లు చేస్తుంది. ప్రజలకు అలౌకికానందంతోపాటు ఆధ్యాత్మిక తత్వాన్ని బోచించే హరికథలంటే వృద్ధులే కాదు, చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు. మధ్య మధ్యలో ఆయన విసిరే చలోక్తులు, చెప్పే పిట్ట కథలు భక్తులను కదలనీయకుండా కట్టిపడేస్తాయి. సినిమా, నాటకం అంతగా అభివృద్ధి కాకముందు ఇవి అమితంగా ప్రజాదరణ పొందాయి.ఒక్క రోజుతో మొదలుపెట్టి హరికథకులు వీటిని నెల రోజుల వరకు ఏకధాటిగా చెబుతూపోగలరు. ఈ హరికథను ఓ గొప్ప కళారూపంగా తీర్చిదిద్దినవారు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు. తాను ఈ హరికథను వ్యాప్తి చేయడమే కాక వందలాది శిష్యులను తయారుచేసి చిరస్థాయిగా నిలిచిపోయారు.


హరికథ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: