telugudanam.com

      telugudanam.com

   

నూతన సంవత్సర వేడుకలు

మన భారతీయ సంస్కృతిపై ప్రపంచ దేశాలలో ఒక ప్రముఖస్థానం ఉంది. అది మన భారతీయ సోదరులు వారి జన్మతః సంక్రమించిన ఆచార వ్యవహారాలను పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటూ, వారితో కలసిమెలసి జీవించే వివిధ మతాల, వివిధ కులాల, వివిధ వర్గాలను సోదరభావంతో చూచుకుంటూ, వారి వారి యొక్క మతాచారాలను కూడా గౌరవిస్తూ, సమైఖ్య భావనతో అభినందించుకుంటూ ఉంటారు. అలా ఆచరించే పండుగలలో ఈ నూతన సంవత్సర పండుగ ఒకటి.

ఈ పండుగ ముఖ్యంగా మన క్రిష్టియన్ సోదరులు అత్యంత ప్రీతి పాత్రంగా ఆచరించరిస్తారు. వీరు ప్రతి సంవత్సరం డిశంబరు నెల 25 వ తేదీ 'క్రిస్మస్ ' వేడుకలతో ప్రారంభించి డిశంబరు 31 వ తేదీ అర్థరాత్రి వరకు జరుపుకుంటూ సరిగా జనవరి 1 వ తేదీ ప్రవేశించు వరకు బాణాసంచాలు కాలుస్తూ నూతన సంవత్సరానికి శుబారంభం పలుకుతూ, తోటి బంధుమిత్రులతో కలసి న్యూఇయర్ కేక్ కట్ చేసి వాటిని, మిఠాయిలను పంచుకుంటూ ఒకరి నొకరు కరచాలనం చేసుకుంటు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెబుతూ ఈ నూతన సంవత్సరం మీ జీవితాలకు సర్వ శుభాలను అందివ్వాలి, అని ఆకాంక్షిస్తూ! అభినందించుకుంటారు.

ఈ నూతన సంవత్సర శుభారంభంలో కొందరు విజ్ఞులైనవారు గల సంవత్సరంలో వారి మానసిక బలఈనతలవల్ల ద్రొల్లిన తప్పిదాలను సరిదిద్దుకొనేందుకు ఈ రోజు కఠినమైన ప్రతిజ్ఞలు చేసి వారి లోపాలను సరిదిద్దుకుంటారు. మరి కొందరు అయితే! వారి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఇది ఒక చక్కని శుభదినంగా బావించి కొత్త కొత్త పొదుపు మార్గాలను ఈ రోజుతో ప్రారంభించి వారి కుటుంబ భవిషత్తు చక్కని పూలబాట వేసుకుంటారు.

ఇల్లు పచ్చగా ఉండాలంటే పొరుగుపచ్చగా ఉండాలి అంటే అందరు సమైఖ్యభావన అలవరచుకోని సోదర భావంతో కలసి మెలసి జీవించాలి. తద్వారా దేశము సుభిక్షంగా ఉంటుంది. ఆ గౌరవమే ప్రపంచ దేశాలలో భారతదేశము తన ప్రముఖస్థానం నిలుపుకుంటూ చెరగని ముద్ర వేసుకుంటుంది. అట్టి డిశెంబరు 31వతేదీ అర్ధరాత్రితో ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతించి, తోటి సోదరులతో కలసి శుభారంభం పలుకుదాం!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: