telugudanam.com

      telugudanam.com

   

పుట్టపర్తి

మంత్రాలయం రోడ్డు స్టేషన్ నుండి రైలు ద్వారా ఆదోని మీదుగా గుంతకల్లు స్టేషనుతో అనంతపురం జిల్లా ప్రవేశించవచ్చు. అనంతపురం జిల్లాలోని ప్రతి వూరూ ప్రతి రాయి దేనిని కదల్చినా రాయలవారి కాలంలోని రతనాల కథలెన్నో చెప్తాయి. అటువంటి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి-శ్రీ భగవాన్ సత్యసాయి బాబాగారి ఆశ్రమం చిత్రావతీ నదీతటాన సత్యం, సుందరమై శివంగా నిత్యం భాసించే పుణ్యస్థలిగా సర్వమానవ సమానత్వానికి ప్రతీకగా అంతర్జాతీయతను సంతరించుకున్న శ్రీ సత్యసాయి ఆశ్రమం ప్రశాంతి నిలయానికి ఆలయంగా ఉన్నది.

సాధారణంగా మహామహులు కొంతమంది అంటే చాలవరకు - వారి జీవిత కాలంలో వ్యతిరేకతల్ని, కష్టనష్టాల్ని ఎదుర్కొని ఇహలోక జీవితం చాలించి తరువాత వారి మహత్యాన్ని, మహతత్వాలు చరిత్రలు చోటుచేసుకొని ఖ్యాతిని బొందటం పరిపాటి. అయితే శ్రీబాబాగారు వారు ఇహలోకంలో ఉండి, భక్తుల పూజలందుకుంటూ ఆశ్రిత కొంగు బంగారమై భాసించటం ఒక ప్రత్యేకత. మాన్యులు, సామాన్యులు, విజ్ఞులు, అజ్ఞులు-బీద, గొప్ప కులమత వివక్షతలేని సర్వమానవతా వాదానికి పరిపుష్టిని చేకూర్చిన ఘనత శ్రీ బాబాగారిదే. అందుకు నిదర్శనం - ఇప్పుడు వారిని అనుసరిస్తున్న వారు యావత్ప్రపంచంలో విశేషమైన భక్తి గౌరవాన్ని చూరగొంటున్న విషయమే:

ముఖ్యంగా అక్కడ విశేషంగా శ్రీబాబాగారి జన్మదినం ప్రతి నవంబరు 23వ తేదీన విశేష ప్రాభవముగా జరుగుతుంది.దసరా, శివరాత్రి, గురుపౌర్ణమి రోజుల్లో భక్తులు దేశవిదేశాల్లోనుండి తండోపతండాలుగా వస్తారు. వుండటానికి కాటేజీలు, పడక సౌకర్యంతో లభ్యమౌతాయి. భోజన భాజనాదులు అక్కడ క్యాంటిన్‌లో చాలా తక్కువ ధరలో మంచి భోజనం దొరుకుతుంది. భక్తులు ముందుగా ఆఫీసర్-ఇన్‌చార్జ్, ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, అనంతపురం జిల్లా వారికి వ్రాసి రిజర్వేషను పొందవచ్చును.


గమనిక:

బెంగుళూరు నుంచి వచ్చేటప్పుడయితే మార్గ మధ్యంలో వున్న లేపాక్షి, పెనుకొండలను కూడా చూసి పుట్టపర్తి చేరవచ్చు. అనంతపురం వైపునించి వచ్చేటట్లయితే ధర్మవరం, బుక్కపట్నం మీదుగా పుట్టపర్తి చేరి, పుట్టపర్తి చూచుకొని వెళ్ళవచ్చు. లేపాక్షి, పెనుకొండలకు, పుట్టపర్తిలో శ్రీబాబా వుండేదీ లేనిదీ వారి కార్యక్రమాలను గురించి తెలిపే "సనాతన సారధి" అనే పత్రిక వీలైతే చూచి రావటం ఎంతయినా సముచితం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: