telugudanam.com

      telugudanam.com

   

శ్రీ కూర్మం

శ్రీకాకుళంకి దగ్గరలోనే శ్రీ కూర్మనాధస్వామి ఆలయం దర్శించదగినది. ఇందుకు తోడు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీ కూర్మవతారము విష్ణ్వంశదశావతారాల్లో ఒకటయి మొదటి ఇది శివక్షేత్రంగా వెలసిఉన్నా శ్రీరామానునాజాచార్యులు వారివలన ఇదివైష్ణవక్షేత్రంగాను, దివ్యప్రదేశంగాను మలచారని చెప్తున్నారు. ఆలయం అతి ప్రాచీనమయినది. చుట్టూ మండపాదుల స్తంభాలమీది శిల్ప చాతుర్యం వేనోళ్ళకొనియాడ దగినది. గోపురాలమీద కూడ విశాలమైన స్ధలమున్నది. ఇక్కడ అనేక పుష్కరిణిలు కూడా వున్నాయి.

ఇక ఇక్కడినుండి ఉత్తర సరిహద్దు రాష్ట్రమయి, పొరుగునేఉన్న ఒరిస్సాలో కాలు పెడుతున్నట్లే. అలా వెళ్ళబోయే ముందు ' మహేంద్రగిరి ' ఒక్కసారి చూచి పోదాము. ఇది ఒక ఎత్తయిన పర్వతం. సుమారు 1,600 మీటర్లు ఎత్తుంటుంది. బంగాళాఖాత సముద్రతీరానికి 25 కి.మీ. దూరంలో వున్నది. ఇచటనే పరుశురాముడు తపస్సు చేశాడట. మన రామాయణ, మహాభారతాల్లో ఈ పర్వత ప్రసక్తి వుంది. ఇక్కడ పురాతనమైన శాసనాలు కూడా కొన్ని దొరికాయి. ఇక్కడ ముఖ్యంగా పాండవులయిన భీమాలయము, యుధిష్టిరాలయము, గోకర్ణేశ్వరాయము చూడదగినవి.

ఇక బహుముఖంగా ప్రఖ్యాతి చెందిన ఒరిస్సా రాష్ట్రానికి వెళ్దాము. ఇది ఆంధ్రప్రదేశ్‌కి ఉత్తరతీరాల కలకత్తా పోయే మార్గంలో, ఈశాన్య మార్గానికి విస్తరించుకొని పోయి పశ్చిమ బెంగాల్‌కి తీసికెళ్తుంది.


యాత్రికులకు ముఖ్య గమనిక :

స్వరాష్ట్రంలోని వారయితే పరవాలేదు - ఎందుకంటే వాతావరణ మార్పులు మొదలైనవాటితో పూర్తి పరిచయం వుంటుంది గనుక. ఇతర చోట్లనించి వచ్చే వారయితే ముఖ్యంగా జూన్‌మధ్య నుండి లేక జులై మొదటినుండి ఆగస్టు, సెప్టెంబరుల వరకు ఋతుపవనాల ప్రభావం ఒక ప్రక్క, అల్పపీడనాలవల్ల మరోవంక వర్షావృతమై యుండి, కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చేస్తుంటాయి గనుక ఈ రెండు మాసాలు తప్పించి ముందుగాని, తరువాతగాని రాష్ట్ర సందర్శనం బాగా అనుకూలంగా వుంటుంది. నవంబరు నుంచి జూన్‌వరకు ప్రకృతి ఆహ్లాదంగా వుంటుంది. ముఖ్యంగా నవంబరు నుండి ఫిబ్రవరి, మార్చి లోపల అయితే భూమి అంతా పచ్చటి చేలతో నయనానందకరంగా వుంటుంది. తనువు పులకించే వింతసోయగాలు సంతరించుకుని వుంటుందీ ప్రదేశం అంతా.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: