telugudanam.com

      telugudanam.com

   

పూరి

ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరి వెళ్ళే వారికి ప్రత్యేకంగా తిరుపతి-పూరి ఎక్సెప్రెస్‌లో ఎక్కి నేరుగా పూరి చేరవచ్చును. లేదా నేరుగా ఎన్నో రైళ్ళు గలిగిన మద్రాసు-కలకత్తా మెయిను లైనులో మొదట భువనేశ్వర్ చేరి అక్కడి నుండి వసతిగా సౌకర్యంగా చూసుకుని రైలెక్కవచ్చు. అదీగాక అనేక బస్సులు కూడా లభ్యమవుతాయి.

పూరి బంగాళాఖాతం తీరములో ఉన్న ఒక పట్టణం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. జగన్నాధాలయం చుట్టూ నగరం నిర్మాణం జరిగివున్నది.

ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసలకోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను, పొంగి పారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు యాత్రాగమనాభిలాషులయి వస్తుండేవారు. కాని ఇప్పుడా శ్రమేం అక్కరలేదు. దేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో పుస్తకాల్లో మత గ్రంధాల్లో ఈ దేవాలయం యొక్క, ఇందున్న శ్రీ జగన్నాధస్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది.

ఇందు ఆలయం ప్రతిష్టించబడిన విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలు పెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరుచుకుని ఉంటాడనే భావంతో కనుక్కోవటానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిధిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతీ, లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికి వివాహం కూడా అయింది. కొంత కాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలోచేరి భగవానుని చూసేటప్పటికి ఇన్నేళ్ళ తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్పురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారయి పూరీ చేరాడు.

తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించటానికి విశ్వావసు కూడా వొప్పుకొన్నాడు. కాని స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆనతిచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజ సమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు వొప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరువమనేంతవరుకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు వొప్పుకున్నారు.

కొన్నాళ్ళ తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండీచ ఓర్పు వహించలేక పోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు. ఎలా వున్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలున తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే:

అయితే దీనిని గురించి, వీని ప్రభావం గురించి అనేక రకాలయిన కథలున్నాయి. ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలివేస్తున్నాం.

ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావతారల్లోని కృష్ణుని ఆవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాలన్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్ధకంగా ఉంటుంది కూడా.

అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.


ఆలయ నిర్మాణ విశేషాలు:

ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జండా ఉంటుంది. జండామీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్నిమైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.


రధయాత్ర:

పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాడ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.

పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాడ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.

ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్ధం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉన్నది. ఇంద్రద్యుమ్న తీర్ధం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: