telugudanam.com

      telugudanam.com

   

గాజుల గౌరి వ్రతము

[ వెనుకకు ]


ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక బ్రాహ్మణపడుచు అడవిలో కూర్చుని యేడ్చుచుండెను. భూమిపరిపాలనకు వచ్చిన పార్వతీపరమేశ్వరులా చిన్నదానిని "ఎందుకమ్మా ఏడ్చుచున్నావు?" అని అడిగి అందుకామె "నాకష్టము నేమని చెప్పను? ఇంతవరకు నాతో నింతతియ్యగా మీరుతప్ప నెవ్వరును మాట్లాడలేదు. నేను పుట్టినది మొదలు నాతల్లిదండ్రులు నన్ను చూచి చిటపటలాడెడివారు. పోనీ అత్తయింటనైన ఆనంద మనుభవించుటకు నోచనైతిని. కాపురమునకు వెళ్ళినది మొదలు నామగడు మామ, అత్త, ఆడబిడ్డ, తోటికోడలు తొబుట్టువులు పెద్దలు పొరుగువారు నన్నుచూచి కోపగించుకొనుచున్నారు. అందరకు నా మీద కోపమైనచో నేనెట్లు బ్రతుకగలను? అని బోరున యేడ్చెను. వారామెను వూరడించి, "అమ్మా! నీవు గాజులగౌరీనోము నోచి ఖర్చుకు వెనుదీసి, కావలసిన గాజులను పేరంటాళ్ళకు తొడిగించక నోమును వుల్లంఘించితివి. అందుచేతనందరు నీపై కోపముగనున్నారు. ఇప్పుడైనా ఆ నోమును జాగ్రత్తగా నోచినయెడల నీవందరకు నిష్ఠురాలవగుదవు" అని చెప్పి వెళ్ళిపోయిరి. ఆమెయు నింటికి వెళ్ళి నోమునోచుకొని, అందరకు తలలోని నాలుకవలె యిష్టముగ జీవించెరు.


దీనికి వుద్యాపనము

ఒక ముత్తయిదువకు యిష్టమైన గాజులను తొడిగించి, తలంటి నీళ్ళుపోసి కొత్తరవికెను చీరను కట్టబెట్టి పిండివంటలతో భోజనమును పెట్టవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు.


మూలం: స్త్రీలవ్రత కథలు, మారిశెట్టి నాగేశ్వరరావు, శ్రీ సీతారామా బుక్ డిపో.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: